అందుకే అది లేపేసాం

Update: 2018-03-27 07:00 GMT

రామ్ చరణ్ రంగస్థలం విడుదలకు కేవలం ఇప్పుడు మూడు రోజులే ఉంది. సుక్కు - చెర్రీ- సామ్ కలయికలో వస్తున్న ఈ గ్రామీణ ప్రేమకథ రంగస్థలంపై మంచి అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా మొదలై ఇప్పటికి ఒక ఏడాది పూర్తి కావొచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు ఈ సినిమా టైటిల్ లో రంగస్థలం 1985 అని వేశారు. కానీ రాను రాను అంటే ఆతర్వాత ఆ టైటిల్ లో 1985 ని లేపేసి కేవలం రంగస్థలం అన్ని మాత్రమే వేస్తున్నారు. అయితే అలా 1985 ని లేపెయ్యడం తో అనేకరకాల ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. కానీ ఎక్కడా క్లారిటీలేదు. అయితే ఇప్పుడు విడుదలకు దగ్గరవుతున్న సందర్భంగా రామ్ చరణ్ 1985 ని ఎందుకు తీసేశారా చెప్పుకొచ్చాడు.

రంగస్థలం ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చేశాడు. సదరు యాంకర్ "మీరు 1985 లో పుట్టారు. మరి రంగస్థలం టైటిల్ లో కూడా 1985 అంటూ క్యాప్షన్ పెట్టారు. కానీ ఇప్పుడది లేదు ఎందుకు అన్ని అడగ్గా.. దానికి చరణ్ అసలు 1980 లో సినిమా ని తియ్యాలి అంటే కేవలం అది ఒక్క ఏడాదికే సినిమాని నడిపించాల్సి వస్తుంది. ఆఖరికి వేషధారణలో, ఇంకా అనేక విషయాల్లో ఆ ఏడాదిని పరిమితం చెయ్యాలి. కానీ మన సినిమా కథ 1980 లో మొదలవుతుంది.. అంటే చాలా కాలం అంటే ఒక దశాబ్ద కాలం కొనసాగుతుంది. అందుకే రంగస్థలం టైటిల్ నుండి 1985 ని తీసేసినట్లుగా చరణ్ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబు లుక్ లో చివరిదాకా లుంగీలోనే కనబడతానని... అలాగే గెడ్డం లుక్ కూడా చివరిదాకా ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు. ఇక సుకుమార్ - రామ్ చరణ్ లు ఈ రంగస్థలంతో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తారో ఈ ఫ్రైడే నే తేలుతుంది.

Similar News