అంతా రహస్యమేనట..!

Update: 2017-06-18 08:30 GMT

అఖిల్ - విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో అఖిల్ రెండో సినిమా స్టార్ట్ అయ్యి చాలా కాలమే అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ ఎంతో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి నిర్మాత నాగార్జున భారీ బడ్జెట్ పెడుతున్నాడు. ఇప్పటికే మెట్రో ట్రైన్ లో యాక్షన్ సన్నివేశాలను 12 కోట్లతో తెరకెక్కించాడు. మరి మొదటి షెడ్యూల్ కే అంతటి బడ్జెట్ పెడుతున్న నాగ్ సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఇంకెంత బడ్జెట్ పెడతాడో అంటున్నారు. ఇకపోతే మొదటి షెడ్యూల్ ముగిసి రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టడానికి విక్రమ్ అండ్ టీమ్ కి కాస్త టైం పట్టిందట. ఎందుకంటే అఖిల్ పక్కన నటించే హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతో సినిమా షూటింగ్ లేటవుతుందనే ప్రచారం జరిగింది.

ఇక ఈ బ్రేక్ లో అఖిల్ కి జోడిగా బాలీవుడ్ భామని దించుతున్నారని ఒకసారి.... అఖిల్ పక్కన మేఘ ఆకాష్ ఫైనల్ అయ్యిందని మరోసారి.... ఇంకోసారి అఖిల్ పక్కన శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ అని మరోసారి సోషల్ మీడియాలో తెగ గాసిప్స్ బయలుదేరాయి. కానీ అఖిల్ పక్కన హీరోయిన్ ని ఇంకా సెట్ చెయ్యలేదని నాగ్ స్వయంగా చెప్పాడు.

కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ కి జోడి దొరికినట్లు చెబుతున్నారు. కానీ ఆ హీరోయిన్ ని సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేవరకు బయట పెట్టకూడదని.... సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టగానే అఖిల్ హీరోయిన్ పేరును గ్రాండ్ గా అనౌన్స్ చెయ్యాలని నాగ్ భావిస్తున్నాడట. అలాగే అఖిల్ రెండో సినిమా పబ్లిసిటీని కూడా కాస్త డిఫ్రెంట్ గా చెయ్యాలనే ఆలోచనలో నాగ్ వున్నాడట. మరి అఖిల్ మొదటి సినిమాతో దెబ్బ తిన్న నాగ్ ఈసారి అఖిల్ రెండో సినిమాకి బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని పై విషయాలను చూస్తుంటే తెలుస్తుంది.

Similar News