జీ 5 – అమెజాన్ లలో ఎవరికీ పడతాడో?

నాగ చైతన్య – సాయి పల్లవి కాంబోలో శేకేర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ షూటింగ్ తాజాగా మొదలయ్యింది. కరోనా ఉన్నప్పటికీ.. శేఖర్ కమ్ముల చైతు [more]

Update: 2020-09-22 05:51 GMT

నాగ చైతన్య – సాయి పల్లవి కాంబోలో శేకేర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ షూటింగ్ తాజాగా మొదలయ్యింది. కరోనా ఉన్నప్పటికీ.. శేఖర్ కమ్ముల చైతు – సాయి పల్లవిలతో షూటింగ్ చిత్రీకరణకు సెట్స్ మీదకి వెళ్ళిపోయాడు. అయితే మరికొద్ది రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతున్న లవ్ స్టోరీ సినిమా కొనడానికి డిజిటల్ అంటే ఓటిటి సంస్థలు పోటీ పడుతున్నాయి. అయినా చైతు కానీ, నిర్మాతలు కానీ లవ్ స్టోరీని డిజిటల్ ప్లాట్ ఫామ్ కి అమ్మడానికి సిద్ధపడడం లేదు. ఎలాగైనా సినిమాని థియేటర్స్ లోనే సినిమాని విడుదల చేయలని గట్టిగా కూర్చున్నారు. 

కానీ ఓటిటి సంస్థలు మాత్రం లవ్ స్టోరీ ని దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా బడ్జెట్ కన్నా భారీ లాభాలు పలికేలా జీ 5 లవ్ స్టోరీకి భారీ ధర ఆఫర్ చేసిందని.. ఈ రేస్ లో లవ్ స్టోరీని జీ 5 దక్కించుకోబోతున్నట్లుగా టాక్ వస్తున్నా టైం లో.. తెలుగు సినిమాలను ఎవరికీ అందకుండా ఎగరేసుకుపోతున్న అమెజాన్ ప్రైమ్ వారు లవ్ స్టోరీ ని కొట్టెయ్యాలనే ప్లాన్ లో జీ 5 కి పోటీకి వచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం మీడియా రేంజ్ సినిమాలన్నిటిని అమెజాన్ ప్రైమ్ కోనేస్తుంది. అలాగే లవ్ స్టోరీ కి కూడా భారీ ధర ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి థియేటర్స్ లోనే విడుదల చేస్తామంటున్న చైతు అండ్ టీం.. చివరికి అందరిలానే ఓటిటి కి పడిపోతారో లేదో.. చూడాలి. ఎవ్వరైనా రేటు ఎక్కువ ఇస్తే వారికే లవ్ స్టోరీ ఓటేస్తుంది. మరి లవ్ స్టోరీ జీ 5 నా అమెజానా అనేది ఎప్పటికి క్లారిటీ ఇస్తారో టీం సభ్యులు.

Tags:    

Similar News