కార్తీ హిట్ సినిమాకు సీక్వెల్..!

Update: 2018-11-27 11:44 GMT

తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ తమిళవాళ్లకే కాదు తెలుగు వాళ్లకి కూడా బాగా పరిచయం. అతను తమిళంలో చేసిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. తెలుగులో తన సినిమా విడుదల ఉన్నప్పుడల్లా ఇక్కడకు వచ్చి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తుంటాడు. అయితే కార్తీ ఇప్పుడు తన హిట్ సినిమాల్లో ఒక్క సినిమాని సీక్వెల్స్ చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. హిట్ సినిమాలకి సీక్వెల్స్ రావడం చాలాకాలం నుంచి జరుగుతున్నదే. ఈ నేపధ్యంలో డైరెక్టర్ సెల్వ రాఘవన్ తో కార్తీ ఓ సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నాడు.

ట్విట్టర్ లో ప్రకటించిన సెల్వ

గతంలో సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వచ్చిన 'యుగానికి ఒక్కడు' కోలీవుడ్, టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. కార్తీ కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన ఈ ప్రయోగాత్మక చిత్రం ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు ఆ సినిమాను సీక్వెల్ చేస్తే బాగుంటది అని ఆలోచన వచ్చిందంట సెల్వకు. కార్తీకి కూడా స్టార్డం ఉంది కాబట్టి ఈ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. చోళరాజుల నేపథ్యంలో సాగే కథను మరోమారు రూపొందించాలనే ఆసక్తి తనలో అలాగే ఉందంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు డైరెక్టర్ సెల్వరాఘవన్. అంటే, త్వరలోనే వీరి కాంబినేషన్ లో 'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ను చూడబోతున్నాం అనమాట. మరి కార్తీ ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎప్పుడు డేట్స్ ఇస్తాడో చూడాలి.

Similar News