ఎన్టీఆర్ కాసుకో... యాత్ర దిగిపోయింది

Update: 2018-07-08 07:06 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో బయో పిక్స్ జోరు మాములుగా లేదు. మహానటి సావిత్రి బయో పిక్ సక్సెస్ అవడం... 2019 ఎన్నికల టార్గెట్ గా ఎన్టీఆర్ అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయో పిక్స్ ఒకదానిమీద ఒకటి పోటీగా తెరక్కెక్కించి విడుదల చేసే ఏర్పాట్లలో నందమూరి, వైఎస్ ఫామిలీస్ బాగా బిజీగా వున్నాయ్. ఎన్టీఆర్ బయో పిక్ ఇంకా పట్టాలెక్కలేదుగాని... వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయో పిక్ మమ్ముట్టి హీరోగా యాత్ర గా పట్టాలెక్కయ్యడమే కాదు తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా యాత్ర టీజర్ ని కూడా విడుదల చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి నాంది పలకడం... అయన సీఎం అవడానికి ఎలాంటి పనులు చేశారు... ఇంకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని క్షున్నంగా ఈ సినిమాలో చూపించబోతున్నారు.

ప్రస్తుతం విడుదలైన యాత్ర టీజర్ లో... వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయ్యేలా చరిత్రలో నిలిచిపోయిన పాదయాత్ర నేపధ్యాన్ని ప్రధానంగా తీసుకున్నట్టుగా ఈ టీజర్ లో స్ఫష్టమైంది. ఇక టీజర్ లో... తెలుసుకోవాలని ఉంది. వినాలని ఉంది. ఈ కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది. వాళ్లతో కలిసి నడవాలని ఉంది. వాళ్ళ గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. నాది పట్టుదలో మూర్ఖత్వమో చరిత్రనే నిర్ణయించుకోని... అంటూ మమ్ముట్టి బ్యాగ్రౌండ్ లో చెప్పే డైలాగ్స్ తో పాటుగా మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా పంచెకట్టు... భుజం మీద కండువా... ఆయన మ్యానరిజం, ఎడమ చేతితో... ప్రజలకి అభివందనం చెయ్యడం తో టీజర్ కి ఎండ్ నిచ్చారు. ఇక మమ్ముట్టి మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలోఒదిగి పోయి కనిపిస్తున్నాడు.

మరి ఈ యాత్ర సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్లస్ పయింట్స్ వరకే చూపెడతారో.... లేదంటే ఆయన మైనస్ లు కూడా చూపెడతారో అనే దానిమీద స్పష్టత లేదు. కాకపోతే.. ఆయన పాదయాత్ర చేసేటప్పటి పరిస్థితులు, ఆయన పడిన కష్టాలు, ఇబ్బందులు, అధికార పక్షం నుండి ఎదురైనా అవమానాలు ఇవన్నీ కలగలిపి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అనుకూలంగా అంటే.. వైఎస్సాఆర్ పార్టీకి అనుకూలంగానే ఈ యాత్ర సినిమా ఉంటుందనేది నిజం. ఇక ఒకవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనస్ లు చూపించరు. ఈ మధ్యన బయో పిక్స్ లో ప్లస్ పాయింట్స్ మీదే ఫోకస్ చేసి నెగెటివ్ పాయింట్స్ ని చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నారు. మరలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయో పిక్ యాత్రలోను ఉండొచ్చు చూద్దాం... ఏం జరుగుతుందో.

Similar News