నాని సినిమాలో విలన్ గా యూత్ ఫుల్ హీరో..!

Update: 2018-12-01 06:16 GMT

మొన్నటివరకు అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందా? లేదా? అన్న టెన్షన్ పడ్డ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కు హీరో నాని అవకాశం ఇచ్చాడు. ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ తీసే విక్రమ్ రీసెంట్ గా నానికి ఓ కథ చెప్పడంతో వెంటనే ఓకే చేశాడు. పూర్తి స్థాయి థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు విక్రమ్. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో మరో హీరోని అనుకున్నాడు విక్రమ్. “బొమ్మరిల్లు”, “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”, “ఓయ్” చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన సిద్దార్థ్ ను విలన్ పాత్ర కోసం సంప్రదింపాడట. సిద్దార్థ్ కూడా కథ మొత్తం విన్నాక ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని తెలుస్తుంది.

తెలుగులో చాలాకాలానికి...

తెలుగులో 'జబర్దస్త్' తరువాత సిద్ధార్థ్ సినిమాలు ఏమీ చేయలేదు. ప్రస్తుతం కేవలం తమిళ్ లోనే సినిమాలు చేస్తున్నాడు. మళ్లీ చాలాకాలం తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా విలన్ గా. మరి విలన్ గా మెప్పిస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా ఓపెనింగ్ జరగనుంది. ప్రస్తుతం నాని 'జెర్సీ' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Similar News