అల్లు అర్జున్ తో విజయ్ పోటీ..!

Update: 2018-11-12 07:42 GMT

టాలీవుడ్ హీరోలలో కొత్తగా స్టయిల్స్ ని పరిచయం చేసే హీరో మాత్రం అల్లు అర్జున్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ ని అందుకే స్టైలిష్ స్టార్ అని సంబోధిస్తారు ఫాన్స్. ఏ పార్టీకి వెళ్లాలన్నా.. ఏ సినిమా ఈవెంట్ కి వెళ్లాలన్నా అల్లు అర్జున్ స్పెషల్ గా డిజైన్ చేసిన కొత్త డ్రెస్ తో వెళ్తాడు. అందరి చూపు తన మీదే ఉండేలా చూసుకుంటాడు. ఎప్పుడూ న్యూ లుక్ తో ఉండడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. డిఫరెంట్ డ్రెస్ లలో అదరగొడతాడు. అయితే ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఐకాన్ కి మరి హీరో పోటీకొస్తున్నాడు. డ్రెస్సులతో డిఫ్రెంట్ స్టయిల్స్ ని ఫాలో అవుతున్న ఆ హీరో అల్లు అర్జున్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు.

పోటీగా వస్తున్న విజయ్...

పెళ్లి చూపులు సినిమాలో నార్మల్ లుక్ తో ఉన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తో స్పెషల్ లుక్ కి మారడమే కాదు... స్పెషల్ డ్రెస్ సెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. తానే ఒక డ్రెస్సింగ్ స్టయిల్ ని డిజైన్ చేస్తూ.. యూత్ కి ఫ్యాషన్ ఐకాన్ గా మారాడు. పంచె కట్టినా... లుంగీ వేసినా... స్పెషల్ డిజైనర్ డ్రెస్ వేసినా ఆ బట్టల్లో విజయ్ దేవరకొండ ఇచ్చే స్టయిల్ ఉంది చూశారూ అబ్బబ్బ ఏముందిరా అనిపించేలా కుర్రకారు ఫాలో అవుతున్నారు. అందులోనూ విజయ్ దేవరకొండ రౌడీ అంటూ ఫ్యాషన్ ని పరిచయం చేస్తున్నాడు.

తనకూ ఓ డ్రెస్ కావాలన్న అల్లు అర్జున్

మరి అలాంటి డ్రెస్ సెన్స్ ఉన్న ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కలిస్తే ఎలా ఉంటుంది. నిన్న రాత్రి జరిగిన టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ తో పాటు అల్లు అర్జున్ కూడా ఓకే వేదికపై ఉన్నారు. మరి స్టైలిష్ స్టార్స్ ఇద్దరు ఒకే చోట కనబడేసరికి యూత్ ఆగుతుందా. ఇక విజయ్ అయితే స్టైలిష్ డిజైనర్ డ్రెస్ తో మెరిసిపోగా... అల్లు అర్జున్ అయితే ఈసారి రౌడీస్ లో చేసిన స్పెషల్ డ్రెస్ నాకు ఇవ్వమని అడిగి అందరినీ ఆశ్చర్యంలో పడేసాడు. విజయ్ డ్రెస్స్ బాగుంటాయని.. ఈసారి ఒక డ్రెస్ కచ్చితంగా ట్రై చేస్తానని చెప్పి... విజయ్ ని ఈసారి తనకి డ్రెస్ డిజైన్ చేసివ్వమని అడిగాడు. మరి ఇద్దరు స్టైలిష్ స్టార్స్ కూడా ఇలా సరదాగా మాట్లాడుకోవడం మాత్రం అందరినీ ఆకట్టుకుంది.

Similar News