వెంకీ కోసం రెడీ అవుతున్న హీరోలు..!

మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండో సినిమా విషయంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అఖిల్ అక్కినేనితో తీసిన మిస్టర్ మజ్ను సినిమా యావరేజ్ [more]

Update: 2019-01-28 06:27 GMT

మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండో సినిమా విషయంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అఖిల్ అక్కినేనితో తీసిన మిస్టర్ మజ్ను సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా వెంకీతో సినిమా చేయడానికి కొంతమంది యంగ్ హీరోస్ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా వెంకీ.. విజయ్ దేవరకొండకి ఓ స్టోరీ లైన్ చెబితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ కాంబినేషన్ సెట్ అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే అఫీషియల్ గా ప్రకటన చేయనున్నారు.

మిస్టర్ మజ్ను ఎఫెక్ట్ పడలేదుగా…

అలానే నాగ చైతన్య కూడా వెంకీ అట్లూరితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఏదైనా మంచి స్టోరీ సెట్ అయితే సినిమా చేద్దామని వెంకీ అట్లూరికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు చైతూ. వీరితో పాటు నాగశౌర్య, నితిన్ కూడా వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. సో మిస్టర్ మజ్ను ఎఫెక్ట్ వెంకీ పైన పడలేదని అర్ధం అవుతుంది. వెంకీ నెక్స్ట్ విజయ్ తో చేసే అవకాశం ఉందని టాక్.

Tags:    

Similar News