శ్రీను వైట్ల కి ఛాన్స్ ఇచ్చిన యంగ్ హీరో

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన డైరెక్టర్ శ్రీను వైట్ల ఆగడు తరువాత నుంచి అన్ని డిజాస్టర్ సినిమాలే తీస్తున్నాడు. రీసెంట్ గా రవితేజ తో కం బ్యాక్ [more]

Update: 2019-10-01 06:29 GMT

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన డైరెక్టర్ శ్రీను వైట్ల ఆగడు తరువాత నుంచి అన్ని డిజాస్టర్ సినిమాలే తీస్తున్నాడు. రీసెంట్ గా రవితేజ తో కం బ్యాక్ అవుతాడు అనుకుంటే మళ్లీ డిజాస్టరే తీశాడు. ప్రస్తుతం ఇతని పేరు ఎక్కడా వినిపించడంలేదు. అయితే చాలా రోజుల తరువాత శ్రీను వైట్ల పేరు తెరపై విపిస్తుంది.

కొత్త సినిమా ఛాన్స్…..

త్వరలోనే ఈయన బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా శ్రీను వైట్ల వెళ్లి శ్రీనివాస్ కు ఓ మంచి కథ వినిపించినట్లు తెలుస్తోంది. అన్నివిధాలా పవర్ ప్యాక్డ్ గా వున్న కథను శ్రీను వైట్ల వినిపించినట్లు బోగట్టా. శ్రీనివాస్ దాదాపు ఓకే చెప్పినట్టే అని తెలుస్తుంది. రీసెంట్ గా ఈ హీరో రాక్షసుడు సినిమాతో తొలి హిట్ కొట్టాడు. దాంతో మనోడు ఇక నుంచి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు సెలెక్ట్ చేసుకుంటా అని సభాముఖంగా చెప్పాడు. మరి శ్రీను వైట్ల చెప్పిన కథ అతనికి కనెక్ట్ అవుతుందో లేదో మరికొన్ని రోజుల్లో తెలిసిపోనుంది. ఒకవేళ ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ అయితే ప్రొడ్యూస్ ఎవరు చేస్తారు అనేది చూడాలి.

 

Tags:    

Similar News