తమిళ సినిమా రీమేక్ లో యంగ్ హీరో..!

Update: 2018-11-23 06:17 GMT

హీరో నితిన్ కెరీర్ ప్రస్తుతం అంతగా బాగోలేదు. త్రివిక్రమ్ తో 'అ..ఆ' సినిమా చేసిన తరువాత ఏ సినిమా హిట్ కాలేదు. 'లై', 'ఛల్ మోహన రంగా', 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలతో వరుస ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కు 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల ఓ కథ చెప్పడంతో అది ఓకే చేసాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాకు 'భీష్మ' అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో నితిన్ సరసన రష్మిక మందన కథానాయికగా నటించనుంది.

తమిళ సినిమాపై మనస్సు...

జనవరి 7వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ నేపథ్యంలో నితిన్ ఓ తమిళ సినిమాపై మనసు పారేసుకున్నాడట. ఆ సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది. తమిళంలో విష్ణు విశాల్ - అమలాపాల్ జంటగా నటించిన 'రాచ్చసన్' అనే మూవీని రామ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. సస్పెన్స్ తో సాగే సైకో థ్రిల్లర్ కథతో ఈ సినిమా అక్కడ అక్టోబర్ 5వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సాధించింది.

పోలీస్ పాత్రలో...

ఇందులో విష్ణు పోలీస్ పాత్రలో నటించాడు. ఇప్పుటివరకు నితిన్ సరైన పోలీస్ పాత్రలో నటించలేదు. కాబట్టి ఈ సినిమా అయితే తనకు కరెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నాడట. మరి ఈ సినిమాలో నితిన్ నటిస్తాడా? లేదా ప్రొడ్యూస్ చేస్తాడా? అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారు. ఒకవేళ నితిన్ ఇందులో నటిస్తే డైరెక్టర్ ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది.

Similar News