చివరికి నితిన్ వద్దకే చేరిన యువ డైరెక్టర్..!

నితిన్ – నిత్య మీనన్ జంటగా నటించిన గుండె జారి గల్లంతయ్యిందే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన విజయ్ కుమార్ తన తొలి సినిమాతోనే సక్సెస్ [more]

Update: 2019-03-19 09:05 GMT

నితిన్ – నిత్య మీనన్ జంటగా నటించిన గుండె జారి గల్లంతయ్యిందే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన విజయ్ కుమార్ తన తొలి సినిమాతోనే సక్సెస్ అందుకోవడంతో అక్కినేని ఫ్యామిలీ నుండి ఆఫర్ వచ్చింది. నాగ చైతన్యతో ఒక లైలా కోసం చిత్రం చేసాడు. కానీ అది పెద్దగా ఆడలేదు. ఈ సినిమా నిరుత్సాహపరిచాక విజయ్ మళ్లీ పెద్దగా ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు. కన్నడకి వెళ్లి అక్కడ నిఖిల్ గౌడతో చిత్రం చేద్దామని చూసాడు కానీ వర్కౌట్ అవ్వలేదు.

నితిన్ కు కథ నచ్చడంతో

ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి కానీ సినిమా ఆగిపోయింది. ఇక చివరికి తొలిచిత్రం అవకాశం ఇచ్చిన నితిన్ దగ్గరకే మళ్లీ వచ్చి చేరాడు. తాజా సినీ సమాచారం ప్రకారం విజయ్ రీసెంట్ గా నితిన్ కు ఓ కథ చెప్పి ఇంప్రెస్స్ చేసాడట. వచ్చే సంవత్సరం మొదటి భాగంలో ఈ దర్శకుడితో ఒక చిత్రాన్ని చేసేందుకు రెడీ గా ఉన్నాడట నితిన్. మరి వీరి కాంబినేషన్ వచ్చే సినిమా సక్సెస్ అవుతుందేమో చూద్దాం.

Tags:    

Similar News