ఒక్క సినిమాతో నువ్వు ఝాన్సీ లక్షి భాయ్ వి కాలేవు!!

ఈమాటన్నది ఎవరో కాదు.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ముంబై లో కంగనా రనౌత్ రచ్చ మాములుగా లేదు. తాను ఒక వీర వనిత, తానొక [more]

Update: 2020-09-12 10:01 GMT

ఈమాటన్నది ఎవరో కాదు.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ముంబై లో కంగనా రనౌత్ రచ్చ మాములుగా లేదు. తాను ఒక వీర వనిత, తానొక ఝాన్సీ లక్ష్మి భాయ్ ని అంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై కాలు దువ్వుతుంది. సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ మరణంతో కంగనా బాలీవుడ్ నేపోటిజం పై మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంపై రెచ్చిపోయి ట్వీట్స్ వేస్తుంది. తానొక ఫైర్ బ్రాండ్ అని.. తనతో పెట్టుకుంటే ఏమవుతుందో చూస్తారంటూ ఏకంగా మహారాష్ట్ర సీఎం కె వార్నింగ్ చేస్తుంది. అందుకే కంగానాకి తగిన బుద్ది చెప్పేందుకు మహారాష్ట్ర మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడం అంటూ కంగనా ఆఫీస్ ని కూల్చేందుకు శతవిధాలా ప్రయత్నించి మొత్తానికి సాధించింది. ఈలోపు కంగనా కోర్టుకెళ్లి స్టే తెచ్చేసింది. అయితే కొంతమంది ఈ విషయంలో కంగానికి సపోర్ట్ చేస్తుంటే.. కొంతమంది కంగానని విమర్శిస్తున్నారు.

అయితే తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కంగానని ఉద్దేశించి వేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలయ్యింది. అది ఒక్క సినిమాతోనే (మణికర్ణికా) కంగనా తనను తాను ఝాన్సీ లక్ష్మి భాయ్ లా పోల్చుకుని.. ఇంత రాద్ధాంతం చేస్తుంటే.. మరి పద్మావతి గా నటించిన దీపికా పదుకొనె, అశోక‌గా న‌టించిన షారుక్,  అక్బ‌ర్ గా న‌టించిన హృతిక్ రోష‌న్, భ‌గ‌త్ సింగ్ గా న‌టించిన అజ‌య్,  మోదీగా న‌టించిన వివేక్, మంగ‌ళ్ పాండేగా న‌టించిన ఆమిర్ ఖాన్, ను కూడా ఆ గొప్పవారితో పోల్చొచ్చు అంటూ కంగాణపై ప్రకాష్ రాజ్ నిప్పులు చెరిగాడు. మరి సినిమాల్తో పాటుగా రాజకీయాల్తోనూ ప్రకాష్ రాజ్ ఫెమస్. అందుకే ప్రకాష్ రాజ్ వేసిన ట్వీట్ అటు రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News