‘యాత్ర’ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..!

మహి వి రాఘవ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచి అంచనాలే [more]

Update: 2019-02-06 08:33 GMT

మహి వి రాఘవ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచి అంచనాలే ఉన్న యాత్ర సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక పొలిటికల్ లీడర్ రాజకీయ జర్నీని ఈ సినిమాలో చూపించబోతున్నారు. వైఎస్సార్ కి సినిమాలతో సంబంధం లేకపోయినా… ఆయన పొలిటికల్ హీరో. అందుకే ఆయన పాత్రకి మలయాళ హీరో మమ్ముట్టిని తీసుకున్నాడు దర్శకుడు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో సరిగ్గా సెట్ అయిన మమ్ముట్టి నటన సినిమాకి ప్లస్ పాయింట్ గా కనబడుతుంది. ఇక శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాత్ర వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు.

ఏరియా బిజినెస్(కోట్లలో)

నైజాం 3.3
సీడెడ్ 2.2
ఆంధ్ర 5.5
ఇతర ప్రాంతాలు 0.4
ఓవర్సీస్ 2.0
వరల్డ్ వైడ్ 13.40 కోట్లు

Tags:    

Similar News