యాత్ర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమా.. పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. దర్శకుడు మహి వి రాఘవ [more]

Update: 2019-02-11 06:42 GMT

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమా.. పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. దర్శకుడు మహి వి రాఘవ వైఎస్ మీదున్న గౌరవంతో ఆయన జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాన్ని యాత్ర రూపంలో ప్రేక్షకులకు అందించాడు. వైఎస్సార్ పాదయాత్ర ద్వారా రాజకీయ నాయకుడిగా ఎంత పాపులర్ అయ్యారో… ప్రజల మనుసులో ఎలా చెరగని ముద్ర ఏసారో అనేది.. ఎవరి మనసులను నొప్పించకుండా తెరమీద ప్రెజెంట్ చేసాడు. ఇంకా సినిమాకి మమ్ముట్టి, రావు రమేష్ వంటి నటులు తోడు కావడంతో యాత్ర సినిమాకి హిట్ టాక్ పడింది. యాత్ర థియేట్రికల్ బిజినెస్ కి సరిపడా కలెక్షన్స్ ని కలెక్ట్ చేస్తుంది. ఇక ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీకెండ్ ని యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మీ కోసం.
ఏరియా షేర్స్(కోట్లలో)
నైజాం 0.64
సీడెడ్ 0.96
అర్బన్ ఏరియాస్ 0.33
గుంటూరు 0.82
ఈస్ట్ గోదావరి 0.21
వెస్ట్ గోదావరి 0.30
కృష్ణ 0.41
నెల్లూరు 0.29
ఆంధ్ర 3.96
ఇతర ప్రాంతాలు 0.50
ఓవర్సీస్ 0.70
టోటల్ వరల్డ్ వైడ్ 5.06 కోట్లు

Tags:    

Similar News