చాప్టర్ 2 లో ఏం చూపించనున్నారు

కేజీఎఫ్ చాప్టర్-1 ఎంత విజయం అయిందో వేరే చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈసినిమాను కన్నడ లో బాహుబలి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. కన్నడ ఇండస్ట్రీ కె ఇది [more]

Update: 2019-03-09 05:42 GMT

కేజీఎఫ్ చాప్టర్-1 ఎంత విజయం అయిందో వేరే చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈసినిమాను కన్నడ లో బాహుబలి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. కన్నడ ఇండస్ట్రీ కె ఇది పెద్ద బ్లాక్ బస్టర్. తెలుగులో కూడా ఈసినిమా పెద్ద హిట్ అయింది. త్వరలోనే చాప్టర్ 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.

మొదటి చాప్టర్ లో హీరో యాష్ నటన అందరిని ఫిదా చేసింది. ఒక చిన్న కుర్రోడు ఎలా మాఫియాలో చేరాడు…కేజీఎఫ్ కోసం ఎందుకు అంత ఆరాటపడతాడో అన్న విషయాలు చూపించారు. ఇక రెండో భాగం లో ఆ బంగారు గని దక్కించుకున్న హీరో ఏం చేశాడు…ఆ స్థానం కోసం పోటీ పడుతున్న శత్రువుల నుంచి ఎలా తప్పించుకున్నాడనే విషయాల్ని చూపించబోతున్నారు.

మొదటి భాగం తో కంపేర్ చేసుకుంటే రెండో భాగం చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా థ్రిల్లింగ్ గా ఉండబోతుందని చెబుతున్నారు. చాప్టర్ 2 కోసం సౌత్ ఇండియా తో పాటు నార్త్ ఇండియా కూడా వెయిట్ చేస్తుంది. వచ్చేనెల మూడో వారం నుంచి కేజీఎఫ్ చాప్టర్-2 సెట్స్ పైకి వెళ్లనుంది. చాప్టర్ 2 కోసం బడ్జెట్ కూడా డబల్ చేసారు.

Tags:    

Similar News