డీసెంట్ గా దూసుకుపోతున్న యాత్ర

ఈ ఫిబ్రవరి మొదటి వారంలో కాస్త పేరున్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర.. నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ [more]

Update: 2019-02-09 07:45 GMT

ఈ ఫిబ్రవరి మొదటి వారంలో కాస్త పేరున్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర.. నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలో ఒక ముఖ్య ఘట్టాన్ని దర్శకుడు మహి వి రాఘవ్… ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించాడు. వైఎస్సార్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటించాడు. మమ్ముట్టి వైఎస్ పాత్రలో అదరగొట్టే నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సినిమా విడుదలైన మొదటి షోకే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ యాత్ర సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న యాత్ర ఇప్పుడు మొదటిరోజే రెండు తెలుగు రాష్ట్రాల నుండి 2.25 కోట్లు కొల్లగొట్టింది.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 0.62
సీడెడ్ 0.42
నెల్లూరు 0.17
కృష్ణ 0.19
గుంటూరు 0.46
వైజాగ్ 0.14
ఈస్ట్ గోదావరి 0.10
వెస్ట్ గోదావరి 0.16

టోటల్ ఏపీ & టీస్ షేర్: 2.26 కోట్లు

Tags:    

Similar News