విజయమ్మ పాత్రలో శివగామి?

Update: 2018-04-21 07:00 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం బియోపిక్స్ హావ నడుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ను తన కొడుకు బాలకృష్ణ నిర్మిస్తుండగా.. పొలిటికల్ లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో రాబోతున్న ‘యాత్ర’. ఈ సినిమా ఆనందోబ్రహ్మ సినిమా ను తీసిన మహి వీ రాఘవన్ ఈ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నాడు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై బజ్ క్రియేట్ అయ్యింది. అయితే రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ పాత్ర చేసేదెవరన్నదానిపై కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ముందు నయనతార పేరు వచ్చింది ఆ తర్వాత మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. లేటెస్ట్ గా మరో ఆసక్తికరమైన పేరు తెరపైకి వచ్చింది.

బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో దేశమంతా పాపులారిటీ సంపాదించుకున్న రమ్యకృష్ణతో విజయమ్మ పాత్ర చేయించాలని దర్శకుడు మహి.వి.రాఘవ్ ప్రయత్నిస్తున్నాడట. ఆమె నటిస్తే ఈ పాత్రకు సరైన న్యాయం జరుగుతుందని నిర్మాతలు అండ్ డైరెక్టర్ భావిస్తున్నారు.అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Similar News