విజయ్ తో అంతా కూల్ అంటున్న హీరోయిన్?

విజయ్ దేవరకొండ ఇప్పుడు పెద్ద స్టార్. టాలీవుడ్ హీరోలే పాన్ ఇండియా అంటే భయపడుతున్న టైం లో విజయ్ దేవరకోన చిన్న కథతో ధైర్యం గా పాన్ [more]

Update: 2020-05-25 04:06 GMT

విజయ్ దేవరకొండ ఇప్పుడు పెద్ద స్టార్. టాలీవుడ్ హీరోలే పాన్ ఇండియా అంటే భయపడుతున్న టైం లో విజయ్ దేవరకోన చిన్న కథతో ధైర్యం గా పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. అయితే విజయ్ దేవరకొండ సెట్స్ లో ఉంటె అంతాకూల్ అంటుంది ఓ హీరోయిన్. ఆమె ఛార్మి. విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాధ్ దర్శకుడిగా నిర్మాతగా ఫైటర్ సినిమా తెరకెక్కిస్తుంటే… ఛార్మి కూడా వన్ అఫ్ ద నిర్మతగా ఈ సినిమాకి పని చేస్తుంది. వన్ అఫ్ ద నిర్మాత అయినా సెట్స్ లో బడ్జెట్ కంట్రోల్  పెట్టె విషయంలో ఛార్మి సూపర్ అంటున్నారు.

అయితే తాజాగా ఫైటర్ సినిమా టైటిల్ కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. విజయ్ – పూరి సినిమాకి అదిరిపోయే టైటిల్ ఆల్రెడీ సెట్ అయ్యింది అని… త్వరలోనే మంచి ముహర్తం చూసి టైటిల్ ప్రకటన ఉంటుంది అని చెప్పిన ఛార్మి తాజాగా హీరో విజయ్ దేవరకొండనే కాదు.. హీరోయిన్ అనన్య పాండే ని కూడా మోసేస్తుంది. హీరోయిన్ అనన్య సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ అని.. ఈ సినిమా తర్వాత ఇండియాలో టాప్ 3 హీరోయిన్స్ లో ఒకరిగా అనన్య ఉంటుందని….. అనన్యలో మంచి టాలెంట్ ఉందని చెబుతుంది. అంతేకాకుండా విజయ్ సెట్స్ లో ఉంటే హాయిగా ఉంటుందని, టెన్షన్స్ ఉండవని చెబుతుంది ఛార్మి.

Tags:    

Similar News