ఛలో కి ఒక కారు.. భీష్మ కి కారు.. నీ పని బావుంది వెంకీ!!

వెంకీ కుడుములు సక్సెస్ ఫుల్ డైరెక్టర్. డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్స్. ఛలో తో డైరెక్టర్ గా మారిన వెంకీ కుడుముల ఆ సినిమాతో [more]

Update: 2020-09-09 09:45 GMT

వెంకీ కుడుములు సక్సెస్ ఫుల్ డైరెక్టర్. డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్స్. ఛలో తో డైరెక్టర్ గా మారిన వెంకీ కుడుముల ఆ సినిమాతో హిట్ కొట్టాడు. అప్పటివరకు ప్లాప్స్ లో కొట్టు మిట్టాడిన హీరో నాగ శౌర్య ఛలో హిట్ తో దర్శకుడు వెంకీ కుడుములకి ఓ కార్ ప్రెజెంట్ చేసాడు. తర్వాత ఛలో కథ నాదే.. వెంకీ కి అంత సీన్ లేదు.. మేమిచ్చిన కార్ కూడా వాడడం లేదంటూ నాగ శౌర్య వెంకీ మీద ఫైర్ అయినా.. వెంకీ కుడుములు మాత్రం ఆ వ్యవహారం పై డీసెంట్ గా వ్యవహరించాడు. ఇక తాజాగా మరో ప్లాప్ హీరో నితిన్ కి భీష్మ లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ ని అందించాడు వెంకీ.

భీష్మ కన్నా ముందు నితిన్ వరసగా నాలుగు ప్లాప్స్ తో ఉన్నాడు. వెంకీ కుడుములతో చేసిన భీష్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. భారీ కలెక్షన్స్ వచ్చాయి. దానితో నితిన్ ఫుల్ ఖుష్. ప్లాప్ ల నుండి వెంకీ తనని బయటపడేసాడు. అందుకే తాజాగా వెంకీ కుడుముల పుట్టిన రోజు నాడు నితిన్ తనకి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి వెంకీ కి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. అది కూడా రేంజ్ రోవర్ కారు.  కాస్ట్లీ రేంజరోవర్ ను గిఫ్ట్ గా ఇవ్వడంతో వెంకీ కుడుములు ఆనందం వ్యక్తం చెయ్యడమే కాదు.. నితిన్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ ఫోటోను వెంకీ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. మరి రెండే రెండు సినిమాలు డైరెక్ట్ చేసి రెండు కార్లు గిఫ్ట్ గా కొట్టేసాడన్నమాట వెంకీ.

Tags:    

Similar News