తమన్నా కన్నా ఆ హీరోయిన్ బెటర్

తమన్నా భాటియా కి బాలీవుడ్ ఆఫర్ రావడంతో టాలీవుడ్ లో ఒప్పుకున్న రాజుగారి గది 3 టీం కి షాకిచ్చి ఆ సినిమా నుండి తప్పుకుందనే ప్రచారం [more]

Update: 2019-07-01 05:19 GMT

తమన్నా భాటియా కి బాలీవుడ్ ఆఫర్ రావడంతో టాలీవుడ్ లో ఒప్పుకున్న రాజుగారి గది 3 టీం కి షాకిచ్చి ఆ సినిమా నుండి తప్పుకుందనే ప్రచారం జరుగుతుంది కానీ.. చిత్ర బృందం మాత్రం ఇంకా ఈ మేటర్ ని ధ్రువీకరించలేదు. అయితే తమన్నా తప్పుకున్న తరవాత ఓం కార్ తమన్నా ప్లేస్ లోకి మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. తమన్నా భాటియా ప్లేస్ లోకి హర్రర్, థ్రిల్లర్ సినిమాలను అలవోకగా చేస్తూ పేరు తెచ్చుకున్న తాప్సి అయితే బావుంటుందని చిత్ర బృందం అనుకుంటుందట.

మరి బాలీవుడ్ లో సక్సెస్ అయ్యి సౌత్ లో మంచి అవకాశాలు, హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉండే.. సినిమాలు చేస్తున్న తాప్సి ఈ రాజుగారి గది 3 చేస్తుందో.. లేదో.. డౌట్. ఎందుకంటే రాజుగారి గది 3 కథ నచ్చితేనే తాప్సి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటుంది. అయితే ఓం కార్ మాత్రం తాప్సి చేత ఎలాగైనా రాజుగారి గది 3 చేపించాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం తమన్నా కన్నా ఎక్కువ క్రేజ్ తాప్సి కే ఉంది. ఎందుకంటే ఆనందో బ్రహ్మ, గేమ్ ఓవర్ వంటి సినిమాల హిట్స్ తో ఉన్న తాప్సి కి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజే ఉంది

Tags:    

Similar News