పవన్ కి వీలవుతుందా?

మెగా కుటుంబం అంత రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నిహారిక పెళ్లి వేడుకల్లో సందడి చేస్తుంది. ఫ్యామిలీ మొత్తం పెళ్ళికి హాజరై హడావుడి చేస్తుంటారు. నాగబాబు కూతురు [more]

Update: 2020-12-08 08:47 GMT

మెగా కుటుంబం అంత రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నిహారిక పెళ్లి వేడుకల్లో సందడి చేస్తుంది. ఫ్యామిలీ మొత్తం పెళ్ళికి హాజరై హడావుడి చేస్తుంటారు. నాగబాబు కూతురు నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ రేపు రాత్రి జరగబోతుంది. మెగా ఫ్యామిలీ మెంబెర్స్ చిరంజీవి ఫ్యామిలీ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ పిల్లలు, అరవింద్ ఫ్యామిలీ, అల్లు శిరీష్, బాబీ ఫ్యామిలీ, సాయి ధరమ్ ఫ్యామిలీ అంతా రాజస్థాన్ కి వచ్చెయ్యడమే కాదు.. నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. నిన్న డిసెంబర్ 7 న మెగా ఫ్యామిలీ మొత్తం ఎవరికి వారే స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసుకుని రాజస్థాన్ కి వెళ్లారు. అయితే అన్న కూతురు నిశ్చితార్థంలో కనబడని పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్ళికి రాజస్థాన్ ఎప్పుడు వెళతాడు.

తుఫాను కి నష్టపోయిన రైతుల కోసం దీక్ష చేపట్టాడు పవన్. ఎక్కడికక్కడే జనసేన నేతలు రైతుల కోసం దీక్ష చేస్తున్నారు. రాజకీయాలతో హడావిడి చేసే పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్ళికి ఎప్పుడు వెళ్తాడు.. తన భార్య కొడుకుతో పవన్ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతాడా అని.. మెగా ఫ్యామిలీ ఎంత ఎదురు చూస్తుందో తెలియదు కానీ.. మెగా ఫాన్స్ మాత్రం అతృతతో ఉన్నారు. ఎందుకంటే చిరు అండ్ ఫ్యామిలీ తమ్ముడి కూతురు కోసం నిన్ననే రాజస్థాన్ కి వెళ్లారు. దానితో పవన్ రాక కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజు ఈవెనింగ్ కానీ, రేపు ఉదయం కానీ పవన్ వెళ్లే సూచనలు ఉన్నాయంటుంటే.. నిశ్చితార్ధానికి హ్యాండ్ ఇచ్చిన పవన్ పెళ్ళికి కూడా డుమ్మా కొడతాడని.. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్. అసలు పవన్ కి నిహారిక పెళ్ళికి హాజరయ్యేందుకు వీలవుతుందా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

Tags:    

Similar News