ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’

Update: 2018-07-18 13:26 GMT

వైఫ్ ఆఫ్ రామ్.. విడుదలకు ముందే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన సినిమా. సోషల్లీ కాన్షియస్ మూవీగా ఇప్పటికే ఈ సినిమాకు మంచి పేరొచ్చింది. ట్రైలర్ కు అద్భుతమైన రెస్సాన్స్ వచ్చింది. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విజయ్ యొలకంటి దర్శకుడు. ఈ నెల 20న విడుదల కాబోతోన్న ఈ మూవీకి సంబంధించి ఎన్నో విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు లక్ష్మి మంచు.

కథ వినగానే ఫ్లాట్ అయిపోయా...

సినిమా గురించి మంచు లక్ష్మీ మాట్లాడుతూ...‘‘వైఫ్ ఆఫ్ రామ్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే థ్రిల్లర్. పాటలు, ఫైట్లు ఉండవు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు. కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. తెలుగులో జానర్స్ లో వచ్చే సినిమాలు తక్కువ. వైఫ్ ఆఫ్ రామ్ ఓ కొత్త జానర్ ను పరిచయం చేస్తూ వస్తోన్న సినిమా. ఈ కథ నేను వినగానే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయాను. ఇది నిజంగానే జరిగిన కథ. అందుకే ఈ కథను చాలా ప్రేమించాను నేను. ఇది ఓ సాధారణ అమ్మాయి, మహిళ, గృహిణి ప్రయాణం. ఒక సంఘటన తన జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది. అనేది నా పాత్ర. అయితే ఈ మధ్య వినిపిస్తోన్నట్టుగా ఈ సినిమాకు బాలీవుడ్ కహానీకి ఈ సినిమాకూ ఏ సంబధం ఉండదు.’’ అని పేర్కొన్నారు. ఈ నెల 20న విడుదల కాబోతోన్న వైఫ్ ఆఫ్ రామ్ లో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది. సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర తారాగణం.

సాంకేతిక నిపుణులు

విజువల్ ఎఫెక్ట్స్ : ఉదయ్ కిరణ్. పి, కాస్ట్యూమ్స్ : అజబ్ అలీ అక్బర్, పీ.ఆర్.వో- జి.ఎస్.కె మీడియా, ఎడిటర్ : తమ్మిరాజు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భార్గవ్, సంగీతం : రఘు దీక్షిత్, మాటలు : సందీప్ గంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వంశీ కృష్ణ, నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్,

Similar News