నితిన్ వ‌రుస ప్లాపుల‌కు కార‌ణం ఇదే..

Update: 2018-04-18 02:05 GMT

యంగ్ హీరో నితిన్ 13 వ‌రుస ప్లాపుల త‌ర్వాత ఇష్క్ సినిమాతో స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చిన‌ట్టే క‌నిపించినా ఆ త‌ర్వాత హార్ట్ ఎటాక్‌, లై తాజాగా ఛ‌ల్ మోహ‌న్‌రంగ సినిమాల‌తో మ‌ళ్లీ ప్లాపుల బాట ప‌ట్టాడు. ఇక నితిన్ చివ‌రి రెండు సినిమాల విష‌యానికి వ‌స్తే రెండూ డిజాస్ట‌ర్ అయ్యాయి. వాస్త‌వంగా ఈ రెండు సినిమాలు మరీ తీసిప‌డేయ‌ద‌గ్గ సినిమాలు అయితే కాదు. లై డిఫ‌రెంట్ క‌ధాంశంతో తెర‌కెక్కింది. ఇక ఇప్పుడు ఛ‌ల్ మోహ‌న్‌రంగ సినిమా కూడా హిట్ టాక్ కాక‌పోయినా ఓకే.

మ‌రి లై, రంగ రెండు ఎందుకు ప్లాప్ అయ్యాయి అంటే సినిమాల కంటెంట్ క‌న్నా వాటి రీలీజ్ రాంగ్ టైమింగ్ కూడా ఓ కార‌ణం. లై సినిమా రిలీజ్ విష‌యంలో నితిన్ నిర్మాత‌లు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో వెళ్లి దెబ్బ‌తిన్నారు. గ‌తేడాది ఆగ‌స్టు 11న లై, రానా నేనే రాజు నేనే మంత్రి, బెల్లంకొండ - బోయ‌పాటి జ‌య జాన‌కీ నాయ‌క సినిమాలు వ‌చ్చాయి. అప్పుడు మూడు సినిమాల విష‌యంలో ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గ‌లేదు.

లైకు థియేట‌ర్లు త‌క్కువుగా దొరికాయి. లై బీ, సీ సెంట‌ర్ల‌కు ఎక్క‌లేదు. త‌క్కువ థియేట‌ర్లు దొర‌క‌డంతో ఎక్కువ మందికి చూసే ఛాన్స్ రాలేదు. దీంతో రెండో వారానికే లై చాలా చోట్ల లేపేశారు. దీనికి తోడు క్లాస్ సినిమా కావ‌డంతో ఏ సెంట‌ర్ల‌లో కొన్ని చోట్ల మాత్ర‌మే ఈ సినిమాను ఎక్కువుగా చూశారు. దీంతో లైకు భారీ న‌ష్టాలు త‌ప్ప‌లేదు.

ఇక తాజా సినిమా ఛ‌ల్ మోహ‌న్‌రంగ విష‌యానికి వ‌స్తే ఈ సినిమా కూడా రాంగ్ టైమింగ్‌లో రిలీజ్ అయ్యింది. రంగ‌స్థ‌లం రిలీజ్ అయిన ఆరు రోజుల‌కే ఈ సినిమాను రిలీజ్ చేశారు. రంగ‌స్థ‌లం థియేట‌ర్ల‌లో ఫుల్ స్వింగ్‌లో ఇప్ప‌ట‌కీ ఉంది. ఈ సినిమా నాన్ బాహుబ‌లి రికార్డుల‌కు పాత‌రేసింది. రంగ‌స్థ‌లం రేజ్‌లో ఈ సినిమాను ప‌ట్టించుక‌న్న వారు లేరు. దీంతో ఇప్పుడు నితిన్ ఈ సినిమాను రాంగ్ టైమింగ్‌లో రిలీజ్ చేశామ‌ని బాధ‌ప‌డుతున్నాడ‌ట‌.

పెద్ద సినిమాల‌తో పాటు మీడియం రేంజ్ హీరోలు సైతం మంచి టైమింగ్ చూసుకుని రిలీజ్ చేస్తుంటే నితిన్ మాత్రం ఇలా రాంగ్ టైమింగ్‌ల్లో త‌న సినిమాలు రిలీజ్ చేసి దెబ్బ‌తింటున్నాడ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ఇక‌పై అయినా ఈ పొర‌పాటును నితిన్ క‌రెక్ట్ చేసుకుంటాడేమో ? చూద్దాం.

Similar News