త్రివిక్రమ్ ఎవరిని రిపీట్ చేస్తాడో?

అలా వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి బన్నీ సుకుమార్ కి కనెక్ట్ అవడం రేపో మాపో సినిమాల్తోల్తో పట్టాలెక్కడం జరగబోతుంది. [more]

Update: 2020-05-29 08:02 GMT

అలా వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి బన్నీ సుకుమార్ కి కనెక్ట్ అవడం రేపో మాపో సినిమాల్తోల్తో పట్టాలెక్కడం జరగబోతుంది. బన్నీ ఏకంగా పాన్ ఇండియా మూవీకి గురి పెడితే… త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఇక్కడికే పరిమితమయ్యాడు. అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ మీద కూర్చున్నాడని.. స్క్రిప్ట్ ని చెక్కడంతోను, ప్రీ ప్రొడక్షన్ పనులతోను బిజీ బిజీగా ఉన్నాడట. ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు RRR నుండి రివీల్ అవుతాడో ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళదామా అని చూస్తున్నాడట.

అయితే ప్రీ ప్రొడక్షన్ తో పాటుగా ఎన్టీఆర్ కి హీరోయిన్ ని సెట్ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడని.. అయితే ఎప్పటిలాగే తనకి అచ్చొచ్చిన హీరోయిన్ నే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం రిపీట్ చేయబోతున్నాడనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. అంటే అలా వైకుంఠం, అరవింద్ సమేతలో నయించిన పూజ హేగ్డ్ ని కానీ, లేదా సన్ ఆఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది సినిమాల్లో నటించిన సమంత ని కానీ ఎన్టీఆర్ సినిమాలో వన్ అఫ్ ద హీరోయిన్ అంటున్నారు. అయితే పాన్ ఇండియా ఫిలిమ్స్ తో దూసుకుపోతున్న పూజ హెగ్డే అయితే బావుంటుంది అని.. లేదంటే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ కి అడుగుపెట్టిన సమంత అయినా సూపర్ అని అంటున్నారు. కాకపోతే సమంత స్టార్ హీరోల సినిమాల్లో రెండు డాన్స్ లకు, చిన్న పాత్రలకు ఓకె చెప్పడం లేదు. అయితే ఈ హీరోయిన్ విషయం ఇంకా ఎన్టీఆర్ తో చర్చించలేదని.. ఎన్టీఆర్ తో ఓ మాట చెప్పి త్రివిక్రమ్ హీరోయిన్ ని ఫైనల్ చేస్తాడని అంటున్నారు.

Tags:    

Similar News