ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరంటే?

రోజులు దగ్గర పడే కొద్దీ బిగ్ బాస్ సీజన్ – 3 ఆసక్తికరంగా మారుతుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు అలానే హౌస్ మేట్స్ మధ్య గొడవలు ఇలా [more]

Update: 2019-09-14 08:36 GMT

రోజులు దగ్గర పడే కొద్దీ బిగ్ బాస్ సీజన్ – 3 ఆసక్తికరంగా మారుతుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు అలానే హౌస్ మేట్స్ మధ్య గొడవలు ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందుగానే తెలిసిపోతుంది. అలానే ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందే తెలిసిపోయింది. ఇది పక్కన పెడితే… వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇప్పటికే ఇద్దరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో మొదటగా ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా తన ప్రవర్తన మరియు పరుష పదజాలం వలన కొద్దిరోజులకే తిరస్కరణకు గురై హౌస్ నుండి వెళ్లిపోవడం జరిగింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన శిల్ప చక్రవర్తి ప్రవర్తన కూడా అంత ఆశాజనకంగా లేదు. అసలు ఆమె హౌస్ లో ఉన్నట్టే లేదు.

ఈ వారం ఆమె వెళ్లిపోతుందా….?

హౌస్ లోకి అడుగు పెట్టినప్పుటి నుంచి ఎవరితో పెద్ద క్లోజ్ గా మూవ్ అవ్వడంలేదు. ఆమె వాలకం చూస్తుంటే సేఫ్ గేమ్ ఆడటానికి వచ్చినట్టు ఉంది. ఈ వారం ఆమె ఎలిమినేషన్ లో ఉంది. ఈ వీక్ ఆమెకు తక్కువ ఓట్లు పడినట్టు తెలుస్తుంది. దాంతో ఈ వారం శిల్ప హౌస్ నుండి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. గత రెండు సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ వైల్డ్ కార్డు ఎంట్రీస్ చాలా సప్పగా ఉన్నాయి.

 

Tags:    

Similar News