బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరంటే

బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ ఎప్పటిలాగే సోషల్ మీడియాలో లీకైపోయింది. బిగ్ బాస్ లీకులు ఫైనల్ ఎపిసోడ్ ని కూడా కబళించడంతో… బిగ్ బాస్ [more]

Update: 2019-11-03 04:30 GMT

బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ ఎప్పటిలాగే సోషల్ మీడియాలో లీకైపోయింది. బిగ్ బాస్ లీకులు ఫైనల్ ఎపిసోడ్ ని కూడా కబళించడంతో… బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో ఇప్పటికే సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. టాప్ 5 లో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రేజాలు ఉండగా.. ఈ ఫైనల్ విన్నర్ గా శ్రీముఖి నే అంటు సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా బోలెడన్ని న్యూస్ లు ప్రచారం లోకొచ్చాయి. అయితే శ్రీముఖి తరుపున చాలామంది ప్రచారం చేసారు. ఇక మొదటినుండి శ్రీముఖిని విన్నరే అని బిగ్ బాస్ శ్రీముఖి తో డీల్ సెట్ చేసిందేనని ఇలా చాలా వార్తలొచ్చాయి.

అయితే ఈ వార్తలన్నిటి బ్రేక్ చేస్తూ.. అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ లో పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా నిలిచాడు. మొదట్లో కాస్త డల్ గా ఆడిన రాహుల్, శ్రీముఖి గేమ్ స్ట్రాటజీతో బాగా హైలెట్ అవడం.. చివరిలో అనూహ్యంగా రాహుల్ మీద సింపతీ రావడంతో.. ఫైనల్ గా టాప్ 2 లోశ్రీముఖి, రాహుల్ ఉండగా… ఫైనల్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. టాప్ 5 లో అలీ రెజా కి తక్కువ ఓట్స్ వచ్చి ఫస్ట్ ఎలిమినేట్ అవగా.. తర్వాతి వరుణ్ సందేశ్, తర్వాత బాబా భాస్కర్ లు ఒక్కొకరుగా ఎలిమినేట్ అయ్యారు. చివరికి రాహుల్ ఫైనల్ విన్నర్ అయ్యాడు.

Tags:    

Similar News