ప్రదీప్ జాడ కానరాదే..!!

మేల్ యాంకర్స్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ప్రదీప్ మాచిరాజు పెళ్లి విషయం తేలడం లేదు. మొన్నామధ్యన ప్రదీప్ పెళ్లిపై సోషల్ మీడియాలో ప్రచారం [more]

Update: 2020-11-16 05:26 GMT

మేల్ యాంకర్స్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ప్రదీప్ మాచిరాజు పెళ్లి విషయం తేలడం లేదు. మొన్నామధ్యన ప్రదీప్ పెళ్లిపై సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అది గాసిప్పో… లేదంటే నిజమో అనే విషయంలో ప్రదీప్ స్పందించనైననూ.. లేదు. ఢీ షో తోనూ, జీ తెలుగు షోస్ తో బిజిగా ఉండే ప్రదీప్ హీరో గా కూడా ట్రై చేసాడు. అది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. కరోనా రాకపోయుంటే ప్రదీప్ హీరోయిజం ఈపాటికి ప్రేక్షకులకు తెలిసేదే. కానీ కరోనా ప్రదీప్ ని ముంచేసింది. మరి అందరూ ఓటిటి అంటున్నా.. ప్రదీప్ 30 రోజుల ప్రేమ కథ మాత్రం ఓటిటి కి ఎక్కలేదు. అలాగని థియేటర్స్ విడుదల డేట్ ఇవ్వడం లేదు. కనీసం ప్రమోషనూ లేదు.

దసరాకి కామ్ గా ఉన్నారు. ఆఖరుకు దివాళీ రోజున కూడా పోస్టర్ లేదు.. ప్రకటనా లేదు. మరి ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో బాగా పాపులర్ అయిన నీలి నీలి ఆకాశం మాత్రం అన్ని ఈవెంట్స్ లోను, అందరి మ్యూజిక్ ఆల్బమ్స్ లోను మోగుతుంది. లేదంటే ప్రదీప్ ఓ సినిమా చేసాడనే విషయం ప్రేక్షకులు మర్చిపోయి చాలారోజులయ్యేది. కనీసం మా సినిమా సంక్రాంతికి అనో.. లేదంటే వచ్చే ఏడాది విడుదల అనో ఏదో ఒక ప్రకటనా ఇస్తే బావుండేది. కానీ ప్రదీప్ 30 రోజుల టీం మాత్రం కామ్ గా సైలెంట్ గా ఉంది. 

Tags:    

Similar News