బడ్జెట్ కంట్రోల్ అన్నారు…. ఏంటయ్యా ఇది?

కరోనా లాక్ డౌన్ తో సినిమా పరిశ్రమ మొత్తం అతలాకుతలం అయ్యింది. అందుకే సినిమాలకు బడ్జెట్ తగ్గించాలి, హీరోలు రెమ్యునరేషన్ ని తగ్గించుకోవాలి.. నిర్మాతలను సేవ్ చెయ్యాలి. [more]

Update: 2020-06-05 04:35 GMT

కరోనా లాక్ డౌన్ తో సినిమా పరిశ్రమ మొత్తం అతలాకుతలం అయ్యింది. అందుకే సినిమాలకు బడ్జెట్ తగ్గించాలి, హీరోలు రెమ్యునరేషన్ ని తగ్గించుకోవాలి.. నిర్మాతలను సేవ్ చెయ్యాలి. అలాంటాప్పుడే సినిమా ఇండస్ట్రీ కోలుకుంటుంది అంటూ దర్శకులు, హీరోలు అందరూ చర్చిస్తున్నారు. అయితే తాజాగా లాక్ డౌన్ ముగిసి సినిమా షూటింగ్స్ కి సిద్దమవడానికి దర్శకనిర్మాతలు, నటులు అంతా సమాయత్తమవుతున్నారు . ప్రభుత్వం ఎప్పుడెప్పుడు అనుమతి ఇస్తుందా. ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళదామా.. అని ఎదురు చూస్తున్నారు అయితే బడ్జెట్ కంట్రోల్ బడ్జెట్ కంట్రోల్ అంటూ.. పాట పడిన దర్శకులే మల్లి బడ్జెట్ కంట్రోల్ చెయ్యకుందునా ఎగాదిగా ఖర్చు కి సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం విదేశాల షూటింగ్స్ అన్ని కొలాప్స్ అయిన కారణంగా విదేశాల్లో చెయ్యాలి అనుకున్న షూటింగ్ ని ఇక్కడే సెట్స్ వేసి మరీ కానిచ్చే ఏర్పాట్లను మొదలెట్టారు. ఇప్పటికే రాజమౌళి RRR షూటింగ్ కి సిద్దమవడమే కాదు… RRR షూటింగ్ కోసం ఓ భారీ సెట్ రాజమౌళి వేయిస్తున్నాడు. మరి ఈ సెట్ ఖరీదు దాదాపు 20కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. మరి భారీ సినిమా కోసం భారీ సెట్స్ అవసరమే కానీ…. ఇలాంటి టైం లో బడ్జెట్ కంట్రోల్ ఉండాలని చెప్పిన రాజమౌళి ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడం మాత్రం నిర్మాతలకు కాస్త టెంక్షన్. మరి RRR కోసం రాజమౌళి దేనికి తగ్గడు, దేనికి వెనుకాడడు. కానీ బడ్జెట్ కంట్రోల్ అని చెప్పింది కేవలం మాటలకే పరిమితమైతే కష్టం కదా..!

Tags:    

Similar News