అఖిల్ అండ్ చైతూలు ఎక్కడున్నారు!!

అఖిల్, నాగ చైతన్యలు తమ సినిమా షూటింగ్స్ లో బిజీగా వున్నారు. లవ్ స్టోరీ ఫినిష్ అయ్యి.. థాంక్యూ తో చైతూ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో [more]

Update: 2020-12-07 07:02 GMT

అఖిల్, నాగ చైతన్యలు తమ సినిమా షూటింగ్స్ లో బిజీగా వున్నారు. లవ్ స్టోరీ ఫినిష్ అయ్యి.. థాంక్యూ తో చైతూ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో అఖిల్.. షూటింగ్స్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాల విడుదల విషయంలో ఈ యంగ్ అక్కినేని హీరోలిద్దరూ ప్రస్తుతం చాలా సైలెంట్ గా ఉన్నారు.  నాగ చైతన్య లవ్ స్టోరీ ముచ్చట సోషల్ మీడియాలో వినిపించడం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు – సాయి పల్లవిలు కలిసి నటించిన లవ్ స్టోరీ షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. మరి ఈ సినిమా సంక్రాంతికి అనడమే కానీ.. మూవీ యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు.

విక్రమ్ కుమార్ తో నాగ చైతన్య థాంక్యూ సినిమాని మొదలు పెట్టేసి సెట్స్ మీదకెళ్ళిపోయాడు. ఇక అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సంక్రాంతికి అంటున్నారు కానీ.. హడావిడి లేదు. మూడు సినిమాల ప్లాప్స్ తర్వాత ప్లాప్ డైరెక్టర్ తో జోడి కట్టిన అఖిల్ కి ఈ సినిమా హిట్ అత్యంత అవసరం. మరి ఈ సినిమా సంక్రాతి రేస్ నుండి తప్పుకుంది కాబట్టే సైలెంట్ గా ఉన్నారని.. వేసవిలో విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క అఖిల్ సినిమా ఓటిటికి అమ్మేసేలా ఉన్నారంటున్నారు. చైతు ఈమధ్యనే సమంత తో కలిసి మాల్దీవులకు ట్రిప్ వేసాడు. అఖిల్ గుర్రమెక్కి స్వారీ చేస్తున్నాడు. కానీ యంగ్ హీరోస్ అందరిలా చైతూ, అఖిల్ సినిమాల విడుదల్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.

Tags:    

Similar News