ఇంతకీ గ్యాంగ్ లీడర్ పరిస్థితి ఏంటి?

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించిన గ్యాంగ్ లీడర్ నిన్న శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా మొదటి షోకే  మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు మాత్రం గ్యాంగ్ [more]

Update: 2019-09-14 07:07 GMT

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించిన గ్యాంగ్ లీడర్ నిన్న శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా మొదటి షోకే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు మాత్రం గ్యాంగ్ లీడర్ పర్వాలేదంటే… రివ్యూ రైట్ర్స్ మాత్రం మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. నాని తన నటనతో సినిమాని ఎంతగా నిలబెట్టాలని చూసినా .. మధ్య మధ్యలో వచ్చిన స్లో నేరేషన్, సాంగ్స్ సరిగ్గా లేకపోవడం, సెకండ్ హాఫ్ మరీ డల్ గా ఉండడం, ఎప్పుడూ లాజిక్ గా సినిమాలు తీసే విక్రమ్ కుమార్.. ఈ సారి లాజిక్ మిస్ కావడం లాంటి వాటితో సినిమాకి మిక్స్డ్ టాక్ పడిపోయింది.

వారంలో తేలుతుంది…

మరి గత వారం సినిమాలేవీ బాక్సాఫీసుని ప్రభావితం చేయలేకపోవడం, ఈ వారం గ్యాంగ్ లీడర్ కి పహిల్వాన్, మార్షల్ సినిమాలు గట్టి పోటీ ఇవ్వకపోవడంతో నాని గ్యాంగ్ లీడర్ కి కలిసొస్తుందని చెప్పాలి. ఏదైనా కలిసిరావడం అటుంచి… ఈ సినిమాని జెర్సీ స్థాయిలో ఊహించుకుని థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ తప్పదనేలా ఉంది గ్యాంగ్ లీడర్. కథ కొత్తగా ఉన్నప్పటికీ.. విక్రం కుమార్ సినిమాని నడిపించిన తీరు గొప్పగా లేదు. అలాగే కొన్ని ట్విస్ట్ లు బావున్నపటికి.. స్లో నేరేషన్ బాగా దెబ్బేయ్యడంతో.. సినిమాకి పర్ఫెక్ట్ పాజిటివ్ టాక్ పడలేదు. మరి గ్యాంగ్ లీడర్ పరిస్థితి ఏమిటనేది.. ఒక వారం రోజుల్లో ప్రేక్షకులే తేల్చేస్తారు.

 

Tags:    

Similar News