అనుష్క నిశ్శబ్దం మిస్టరీ వీడేనా?

థియేటర్స్ బంద్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియక ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలన్నీ ఓటిటి బాటే పడుతున్నాయి. నిన్నగాక మొన్న నాని వి సినిమానే ఓటిటిలో విడుదలైపోయింది. నాని [more]

Update: 2020-09-09 03:21 GMT

థియేటర్స్ బంద్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియక ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలన్నీ ఓటిటి బాటే పడుతున్నాయి. నిన్నగాక మొన్న నాని వి సినిమానే ఓటిటిలో విడుదలైపోయింది. నాని వి అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా.. ఆనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా విషయం మాత్రం ఇంకా తెగడం లేదు. ఎప్పుడో ఏప్రిల్ లో విడుదలకు సిద్దమైన ఈ సినిమాని ఎలాగైనా థియేటర్స్ లో దింపాలని నిశ్శబ్దం నిర్మాతలు వేచి చూస్తున్నారు. కానీ థియేటర్స్ ఓపెన్ మాత్రం నిశ్శబ్దానికి ఛాలంజ్ చేస్తూనే ఉంది. తాజాగా నిశ్శబ్దం మూవీని అమెజాన్ ప్రైమ్ వారే భారీ డీల్ కి కొనుగోలు చేసారని… జస్ట్ అగ్రిమెంట్ అవడమే తరువాయి రిలీజ్ డేట్ వచ్చేస్తుంది అని అన్నారు.

అని కూడా పది రోజులైంది. కానీ ఇంతవరకు నిశ్శబ్దం సినిమా డేట్ పై క్లారిటీ లేదు. అసలు ఓటిటి నుండే సినిమా విడుదల అనే స్పష్టత లేదు. అటు అనుష్క కానీ ఇటు నిర్మాతలు కానీ నిశ్శబ్దాన్ని వీడడం లేదు. ఓటిటికి అమ్మేస్తే ఈపాటికి ప్రమోషన్స్ మొదలు కావాలి. అలాగే ఓటిటి డేట్ కూడా రావాలి. కానీ ఎలాంటి న్యూస్ నిశ్శబ్దంపై రావడం లేదు. మరి థియేటర్స్ తెరిచేవరకు ఈ సినిమా విడుదల ఆపేసిన ఆపెయ్యొచ్చనే వెర్షన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి నిశ్శబ్దం టీం నిశ్శబ్దాన్ని చేధించి క్లారిటీ ఇస్తే అభిమానులకు కన్ఫ్యూజన్ ఉండదు అంటున్నారు.

Tags:    

Similar News