బండ్ల ని ఏం చేస్తాడో?

పవన్ కళ్యాణ్ వరసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. రాజకీయాలకు స్వస్తి చెబుతాడో? లేదంటే రాజకీయాలు – సినిమాలు అంటూ తిరుగుతాడో తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ సినిమాల లిస్ట్ [more]

Update: 2020-10-28 03:55 GMT

పవన్ కళ్యాణ్ వరసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. రాజకీయాలకు స్వస్తి చెబుతాడో? లేదంటే రాజకీయాలు – సినిమాలు అంటూ తిరుగుతాడో తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ సినిమాల లిస్ట్ చూస్తుంటే దిమ్మఇరగాల్సిందే. పవన్ ఇస్తున్న అప్ డేట్స్ తో ఆయన ఫాన్స్ అయితే దిల్ ఖుష్. ఎందుకంటే రాజకీయాలంటూ పవన్ హీరోయిజాన్ని వదులుకుంటున్నాడు.. ఇక ఇప్పుడు సినిమాలు అంటున్నాడు కాబట్టి పవన్ ఫాన్స్ కి అంతా హ్యాపీనే. ఇక పవన్ కళ్యాణ్ లిస్ట్ లో వకీల్ సాబ్, క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, కొత్తగా శేఖర్ కె చంద్ర ఇలా ఉంది పవన్ కళ్యాణ్ సినిమాల లిస్ట్. మరి ఇందులో నిర్మాత బండ్ల గణేష్ మిస్ అవుతున్నాడు.

అంటే పవన్ కళ్యాణ్ తనకి సినిమా చేస్తా అని పవన్ మాటిచ్చాడని అంటున్నాడు బండ్ల. కానీ బండ్ల గణేష్ కి దర్శకుడు దొరకాలి. కథ సెట్ అవ్వాలి. ఈలోపు పవన్ మరో సినిమా అనౌన్స్ చెయ్యకుండా ఉండాలి. అయితే బండ్ల దర్శకుడిని కథని తీసుకుని పవన్ ని కలిస్తే బండ్ల సినిమా శేఖర్ చంద్ర సినిమా తర్వాత ఉంటుంది. లేదంటే పవన్ కళ్యాణ్ మరో సినిమా ప్రకటిస్తే బండ్ల ఏమైపోతాడో.. అయితే తాజాగా బండ్ల కూడా కొత్త దర్శకుడి ని పట్టాడని.. 
ఆ దర్శకుడితో పవన్ వద్దకు వెళ్లేందుకు బండ్ల రెడీ అవుతున్నాడని టాక్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. అయితే పవన్ మరో సినిమా ప్రకటిస్తాడు? లేదంటే బండ్ల ని లైట్ తీసుకుంటాడా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Tags:    

Similar News