స్టార్స్ తో వెబ్ సీరీస్… ఇంట్రెస్టింగ్!!

ప్రస్తుతం డిజిటల్ హవా మాములుగా లేదు.. థియేటర్స్ మూత పడడంతో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ఇంట్లోనే ఉండి ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో వచ్చే [more]

Update: 2020-05-11 04:26 GMT

ప్రస్తుతం డిజిటల్ హవా మాములుగా లేదు.. థియేటర్స్ మూత పడడంతో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ఇంట్లోనే ఉండి ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో వచ్చే వెబ్ సీరీస్ ని కొత్త సినిమాలను, పాత సినిమాలను అబ్బో.. ఓటిటి ని రుద్ది పడేస్తున్నారు ప్రేక్షకులు. సినిమాలకు ధీటుగా వెబ్ సీరీస్ నిర్మాణం జరుగుతుంది కూడా. అందుకే రాజమౌళి లాంటి దర్శకులే ఓటీటీలకు వెబ్ సీరీస్ లను మించి సినిమాలు చేయాలంటున్నారు. స్టార్స్ కూడా వెబ్ సీరీస్ వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే తమిళనాట ఓ టాప్ డైరెక్టర్ స్టార్స్ తో వెబ్ సీరీస్ చేస్తానంటున్నాడు.

గతంలో అంటే 2018 లో వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్, ఆండ్రియా, సముద్రఖని, అమీర్, ఐశ్వర్య రాజేష్ వంటి స్టార్స్ తో వడచెన్నై అనే సినిమాని చేస్తే.. అది అఖండ విజయం సాధించింది. అయితే అప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ అన్నారు. వడచెన్నై ఉత్తర చెన్నై లో జరిగే నేరాలు ఘోరాల కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా. అయితే ఇప్పుడు వెట్రిమారన్ అదే స్టార్ కాస్ట్ తో ఈ సినిమాకి సీక్వెల్ గా వెబ్ సీరీస్ ని ప్లాన్ చేస్తున్నాడు. ప్లాన్ కాదు.. ఆ వెబ్ సీరీస్ ని తెరకెక్కిస్తా అని చెప్పాడు కూడా. అంటే ధనుష్ లాంటి స్టార్ హీరో, సముద్రఖని లాంటి కేరెక్టర్ ఆర్టిస్ట్ లు వెబ్ సీరీస్ లో నటిస్తే.. ఆ వెబ్ సీరీస్ కి పిచ్చ క్రేజ్ రావడం ఖాయమే. 

Tags:    

Similar News