ఆ ట్రైలర్ దిల్ రాజుకు వార్నింగ్ బెల్..!

తమిళంలో రీసెంట్ గా రిలీజ్ అయిన 96 చిత్రం ఎంత సెన్సేషన్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. విజయ్ సేతుపతి – త్రిష జంటగా నటించిన ఈ [more]

Update: 2019-04-18 10:14 GMT

తమిళంలో రీసెంట్ గా రిలీజ్ అయిన 96 చిత్రం ఎంత సెన్సేషన్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. విజయ్ సేతుపతి – త్రిష జంటగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా ఇప్పుడు పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. కాగా కన్నడలో ఈ సినిమాను ఆల్రెడీ 99 అనే పేరుతో రీమేక్ చేసారు. కన్నడ గోల్డెన్ స్టార్ గణేష్, భావన ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 26న విడుదల అవుతున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ ట్రైలర్ పై నెగటీవ్ కామెంట్స్ వస్తున్నాయి.

తమిళ డైరెక్టర్ తోనే తెలుగులో…

విజయ్ – త్రిష మధ్య పండిన కెమిస్ట్రీ వీరి మధ్య లేదని, అసలు ఆ సినిమాలో ఉన్న ఫీల్ ఈ సినిమాలో కలగటం లేదని కామెంట్స్ చేస్తున్నారు. 96 చిత్రం అనేది ఒక ఫీల్ గుడ్ మూవీ అని, దాన్ని వీరు నాశనం చేశారని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కన్నడ ‘99’ ట్రైలర్ దిల్ రాజుకి వార్నింగ్ బెల్ లా మారింది. దిల్ రాజు 96 సినిమాను తెలుగులో శర్వానంద్, సమంతలతో తీస్తున్నాడు. తమిళ్ లో ఉన్న ఫీల్ తెలుగులో కూడా మిస్ అవ్వకూడదని దిల్ రాజు డైరెక్టర్ కి చెప్పాడట. తమిళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.

Tags:    

Similar News