మొదటి స్థానంలో వార్ చిత్రం

బాలీవుడ్ లో లేటెస్ట్ గా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ జంటగా నటించిన వార్ చిత్రం రిలీజ్ రోజు నుంచి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఫుల్ యాక్షన్ [more]

Update: 2019-10-17 08:10 GMT

బాలీవుడ్ లో లేటెస్ట్ గా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ జంటగా నటించిన వార్ చిత్రం రిలీజ్ రోజు నుంచి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో తెరకెక్కిన ఈ మూవీ వసూళ్ల పరంగా దుమ్ము లేపుతుంది. ఈ చిత్రం ఏకంగా 2019 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇండియా మొత్తంగా వసూళ్లు చూసుకుంటే 280 కోట్లకు పైగా వసూళ్లు చేసి హైయెస్ట్ గ్రాసర్ గా మొదటి స్థానంలో ఉంది.

వసూళ్ల పండగ…

మొన్నటివరకు మొదటి స్థానంలో కబీర్ సింగ్ ఉంటే ఇప్పుడు అది రెండో స్థానంలోకి వెళ్లింది. మూడో స్థానంలో ఉరి ఉంది. 2019 లో హైయెస్ట్ గ్రాసర్ గా మొదటి స్థానంలో ఉన్న ఈ చిత్రం ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్సర్ లిస్టులో వార్ మూవీ 10వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా స్ట్రాంగ్ గా నడుస్తుంది. సో ఇంకా వసూళ్లు స్థిరంగా కొనసాగుతున్న తరుణంలో ఈ మూవీ ఇంకా ర్యాంక్ మెరుగు పరుచుకునే అవకాశముంది.

 

Tags:    

Similar News