బాలీవుడ్ లో వార్ సరికొత్త రికార్డు

బాలీవుడ్ లో గాంధీ జయంతి నాడు అంటే నిన్న హ్రితిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన యాక్షన్ ఫిలిం వార్ మొదటి రోజు కలెక్షన్స్ [more]

Update: 2019-10-04 08:25 GMT

బాలీవుడ్ లో గాంధీ జయంతి నాడు అంటే నిన్న హ్రితిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన యాక్షన్ ఫిలిం వార్ మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ మొదటి రోజు ఏకంగా ఎవరూ ఊహించని విధంగా 51.5 కోట్లు నెట్ వసూళ్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.

కలెక్షన్ల పంట….

ఈ సినిమా రాకముందు వరకు ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ మొదటి స్థానంలో ఉండేది. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ మొదటి రోజు 50 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ దాటిన మొదటి సినిమా కాగా ఇప్పుడు ‘వార్’ ఆ సినిమాను దాటేసింది. బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ సినిమా ఇంతలా కలెక్ట్ చేస్తుందని ఎక్స్పర్ట్ చేయలేదు అని తెలుస్తుంది. రివ్యూస్ కూడా యావరేజ్, డీసెంట్ అంటూ ఇచ్చారు కానీ కలెక్షన్స్ ఏమో ఒక రేంజ్ లో వస్తున్నాయి. ఇతర భాషల్లో కూడా ఈ సినిమా కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ఏడాది హయ్యెస్ట్ డే 1 కలెక్షన్స్ సాధించిన టాప్ -6 హిందీ చిత్రాల లిస్టు కింద మీకోసం

( ఇండియా – నెట్ కలెక్షన్స్)

1. వార్: 53.35 cr

2. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ 50 cr

3. భరత్ 42.30 cr

4. మిషన్ మంగళ్: 29.16 cr

5. సాహో: 24.40 (హిందీ వెర్షన్)

6. కళంక్: 21.60 cr

 

Tags:    

Similar News