ఇద్దరు క్రికెటర్ల మధ్య వార్ తప్పిందా..?

క్రికెట్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతున్న రెండు సినిమాలు ఒకే విడుదల డేట్ ని ఫిక్స్ చేసుకున్నాయి. నాగ చైతన్య – సమంత జంటగా తెరకెక్కిన మజిలీ క్రికెట్ [more]

Update: 2019-03-07 08:14 GMT

క్రికెట్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతున్న రెండు సినిమాలు ఒకే విడుదల డేట్ ని ఫిక్స్ చేసుకున్నాయి. నాగ చైతన్య – సమంత జంటగా తెరకెక్కిన మజిలీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కింది. చైతు క్రికెటర్ గా కనిపించనున్న మజిలీ సినిమాపై మంచి అంచనాలున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఇక మరో సినిమా కూడా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కింది. అదే నాని హీరోగా వస్తున్న జెర్సీ. గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో నాని – శ్రద్ద శ్రీనాద్ జంటగా జెర్సీ సినిమా కూడా ముందు ఏప్రిల్ 5నే విడుదల అన్నారు.

పోటీ వద్దనుకుంటున్న నాని

అయితే చైతు – సమంత మాత్రం ఏప్రిల్ 5నే పక్కాగా థియేటర్స్ లోకి రానున్నారు. కానీ నాని మాత్రం ఆలోచనలో పడినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే చైతుతో క్లాష్ ఎందుకులే.. ఎలాగూ మహేష్ మహర్షి సినిమా వాయిదా పడిందిగా అని ఆలోచిస్తున్నాడట. మహర్షి ఏప్రిల్ 25 నుంచి మే 9కి వాయిదా పడింది. దీంతో నాని తన జెర్సీ సినిమాని ఏప్రిల్ 19న విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాతలతో చర్చిస్తున్నాడట. తాజాగా నాని నిర్ణయంతో చైతు, నానికి మధ్య క్లాష్ తప్పిపోయిందనే చెప్పాలి. ఇక నాని – గౌతమ్ తిన్నసూరిల జెర్సీ విడుదల డేట్ పై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారని సమాచారం.

Tags:    

Similar News