వినయ విధేయ రామ ఓవర్సీస్ లో మరీ దారుణం..!

ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక సినిమా తప్ప ఇంకేమి టాక్ పరంగా.. వసూళ్లపరంగా హిట్ అవ్వలేకపోయాయి. ముందుగా వచ్చిన ఎన్టీఆర్ [more]

Update: 2019-01-21 06:55 GMT

ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక సినిమా తప్ప ఇంకేమి టాక్ పరంగా.. వసూళ్లపరంగా హిట్ అవ్వలేకపోయాయి. ముందుగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా వసూళ్లపరంగా ఫెయిల్ అయింది. రజనీ పేటకు థియేటర్స్ చాలా తక్కువ రావడంతో, కంటెంట్ పరంగా కూడా అంత గొప్పగా ఏమీ లేకపోవడంతో ఈ సినిమా కూడా నెగటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఎఫ్ 2 విషయానికి వస్తే మొదటి రోజు నుండి ఈ సినిమా సూపర్ హిట్ అనే టాక్ సొంతం చేసుకుని ఇప్పటికీ కొన్ని ఏరియాస్ లో స్ట్రాంగ్ గా నడుస్తుంది.

ఓవర్సీస్ లో భారీ లాస్

ఇక దీని ముందు రిలీజ్ అయిన రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సంగతి సరే సరి, ప్రిమియర్ షోల నుండే అతి దారుణమైన డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుని ఓవర్సీస్ లో దారుణమైన పరిస్థితి ఎదురుకుంది. ఈ సినిమాను అక్కడ 1 మిలియన్ డాలర్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రాకపోగా, భారీ నష్టాన్నే మిగిల్చింది. 2 లక్షల 25 వేల డాలర్ల క్లోసింగ్ గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అందులో క్లోసింగ్ షేర్ 1లక్షా 25 వేల డాలర్లు మాత్రమే వచ్చింది. అంటే పెట్టిన 1 మిలియన్ డాలర్ల పెట్టుబడి రాకపోగా డిస్ట్రిబ్యూటర్ కు అదనంగా 23 వేల డాలర్ల నష్టం మిగిలిందన్నమాట.

Tags:    

Similar News