విలన్ ఇమేజ్ తగ్గించిన ఆ డైరెక్టర్

నిన్న వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన అన్ని [more]

Update: 2019-01-12 04:34 GMT

నిన్న వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన అన్ని చోట్ల మిశ్రమ స్పందన వచ్చిన ఈసినిమాలో పెద్దగా కొత్తదనం ఏమి లేకపోవడంతో ఈసినిమాను ప్రేక్షకులు పెద్దగా పటించుకోట్లేదు. బోయపాటి తన స్టైల్ మార్చకుండా అదే పాత పద్దతిలోనే మాస్, యాక్షన్ ప్రధానంగా సినిమా తీసాడని అంటున్నారు.

మధ్యమధ్యలో ఫామిలీ ఎమోషన్స్ పండించిన అవి పెద్దగా సక్సెస్ అవ్వలేదని చెబుతున్నారు. కామెడీ సీన్స్ కూడా విసిగించెలా ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఇందులో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు ఒబెరాయ్ గురించి మాట్లాడుకోవాలి. తెలుగు రక్త చరిత్ర సినిమాతో పరిచయం అయినా వివేక్ అప్పుడే విలన్ రోల్స్ చేయనని చెప్పేసాడు. మరి బోయపాటి ఏం చేసాడో కానీ వినయ విధేయ రామ లో విలన్ గా చేసాడు.


విలన్ పాత్రలో కూడా పెద్దగా కొత్తదనం లేదని అంటున్నారు, బోయపాటి గత సినిమాల్లో లాగే రొటీన్ గా ఉందని అంటున్నారు. నటన పరంగా వివేక్ బాగా చేసాడు కానీ పాత్రలో కొత్తదనం లేకపోవటం వల్ల వివేక్ కు ఆ రోల్ ఏ మాత్రం ప్లస్ అవ్వదని అంటున్నారు. సినిమాలో వచ్చే కొన్నికొన్ని సీన్స్ రామ్ చరణ్ – వివేక్ మధ్య వచ్చే సీన్స్ ఎందుకు వస్తాయో ఎందుకు అంతలా ఫైట్ చేసుకుంటున్నారో కూడా అర్ధం కాదు. వివేక్ కు ఉన్న బ్రాండ్ బోయపాటి ఒక్క దెబ్బతో తీసేసాడు అని అంటున్నారు.

Tags:    

Similar News