`విశ్వరూపం 2`కి లైన్ క్లీయర్ అయినట్లేనా..?

Update: 2018-08-09 08:04 GMT

కమల్ హాసన్ హీరోగా నటించిన 'విశ్వరూపం 2' వరల్డ్ వైడ్ గా రేపు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొన్న తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి చనిపోవడంతో ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఓ క్లారిటీ కూడా ఇచ్చింది. ఈ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వాయిదా వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని... అందుకే ఈ సినిమాను అనుకున్న డేట్ కె రిలీజ్ చేయాలనీ నిర్ణయించుకున్నారు మేకర్స్.

పార్ట్ 2 పైనా భారీ అంచనాలు

అంటే రేపు సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతోంది. ఈ సందర్భంగా పార్ట్ 2 కలెక్షన్స్ ఎలా ఉంటాయో అన్న ఆసక్తికర చర్చ ట్రేడ్ లో సాగుతోంది. 'విశ్వరూపం' మొదటి పార్ట్ ఏకంగా 250 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు దాదాపు 95 కోట్ల బడ్జెట్ అయింది. అప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎన్నో సందిగ్ధతలు... ఎన్నో ఆటంకాలు.. ఎన్నో సంక్లిష్ఠతలు ఎదురైయ్యాయి. అయినా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. అయితే ఆ పరిస్థితులు పార్ట్ 2 కి లేవు. అటు హిందీలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇదే కమల్ చివరి సినిమా..

ఓవర్ అల్ గా ఈ సినిమా మొదటి పార్ట్ కంటే ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు. ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే కమల్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టె విషయం ఏంటంటే ఈ సినిమా తర్వాత కమల్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతున్నాడు అని కోలీవుడ్ మీడియా టాక్.

Similar News