విలన్ గా మారబోతున్న డైరెక్టర్ కం హీరో..!

తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో మంచి సక్సెస్ అందుకున్న హీరో విశ్వక్ ‌సేన్‌ మంచి నటుడే కాదు మంచి డైరెక్టర్ కూడా. ఆయన రీసెంట్ గా [more]

Update: 2019-05-24 10:18 GMT

తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో మంచి సక్సెస్ అందుకున్న హీరో విశ్వక్ ‌సేన్‌ మంచి నటుడే కాదు మంచి డైరెక్టర్ కూడా. ఆయన రీసెంట్ గా ‘ఫలక్ నుమా దాస్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాకపోతుంది. ఇక ఇటీవలే ఇతను మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. అయితే ఈసారి దర్శకుడిగా కాదు. హీరో గా కూడా కాదు. విలన్ గా కనిపించనున్నాడు.

కొత్త దర్శకుడి సినిమాలో

ప్ర‌దీప్ పులివ‌ర్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో రానున్న ‘కార్టూన్‌’ అనే చిత్రంలో విశ్వక్‌ సేన్ విలన్ గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందులో విలన్ పాత్ర మెయిన్ అంట. రీసెంట్ గా ఈ చిత్రం డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చేతుల మీదుగా ప్రారంభం అయింది. వచ్చేనెల జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి అధికార ప్రకటన త్వరలోనే రానుంది. డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్కబోతున్న ఈ సినిమా మిగిలిన కాస్టింగ్ కూడా తెలియనుంది.

Tags:    

Similar News