విశాల్ ఇరగదీస్తున్నాడుగా!!

Update: 2018-10-20 03:42 GMT

తమిళనాట లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ - కీర్తి సురేష్ జంటగా వరలక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా సండకోళి 2 టైటిల్ తో తమిళనాట విడుదలకాగా.. తెలుగులో పందెం కోడి 2 గా విడుదలైంది. తమిళనాట సండకోళి 2 కి హిట్ టాక్ రాగా.. తెలుగులో మాత్రం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా దసరా కానుకగా గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్ మాస్ నటన తో ఈ సినిమాలో ఆకట్టుకోకగా... కీర్తి సురేష్ పాత్రకి సో సో టాక్ రాగా.. మరో పవర్ ఫుల్ పాత్రలో నటించిన వరలక్ష్మి పాత్రకి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది.

పందెంకోడి లాగా......

ఇక కథ, కథనం, లింగుస్వామి దర్శకత్వం కూడా యావరేజ్ గా ఉండగా.. ఈ సినిమా 13 ఏళ్ళ క్రితం వచ్చిన పందెం కోడి సినిమాకి సీక్వెల్ అయినప్పటికీ... పందెం కోడి సినిమా అంత పవర్ ఫుల్ గా లేదన్నారు. అప్పట్లో పందెం కోడి సూపర్ హిట్ అయ్యింది. ఇక పందెం కోడి 2 కి యావరేజ్ టాకొచ్చినా విశాల్ నటనతో ఈ సినిమా మొదటిరోజు విశాల్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. కేవలం తమిళనాడు లోనే సండకోళి 2 5.5కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి..... విశాల్ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించుకుంది. రాయ‌ల‌సీమ‌లోని రెండుకుటుంబాల మ‌ధ్య రాజుకున్న ప‌గ‌.. అంటే రూరల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు.

తెలుగులోనూ మంచి కలెక్షన్లు.....

కేవలం మొదటి రోజే కాదు.. విశాల్ పందెం కోడి నిన్న శుక్రవారం కూడా తమిళనాట మంచి వసూళ్ళని సాధించిందంటున్నారు. ఇక తెలుగులోనూ రామ్ హీరోగా వచ్చన హలో గురు ప్రేమ కోసమే చిత్రానికి కూడా యావరేజ్ టాక్ రావడంతో.. పందెం కోడి 2 కి తెలుగులోనూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయంటున్నారు. మరి డిటెక్టీవ్, అభిమన్యుడు హిట్స్ తో ఇరగదీసిన విశాల్ ఇప్పుడు పందెం కోడి 2 తో కూడా హిట్ ట్రాక్లో దూసుకుపోతున్నాడు.

Similar News