విశాల్ కి కాన్ఫిడెన్స్ ఎక్కువైందా..?

Update: 2018-06-11 11:02 GMT

విశాల్ ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. పందెం కోడి వంటి సినిమాలు చేసిన విశాల్ మధ్యలో మాస్ అంటూ పరిగెత్తి చాలా సఫర్ అయ్యాడు. మళ్ళీ డిటెక్టీవ్ అవతారమెత్తిన విశాల్ కి వరుస విజయాలు తలుపుతడుతున్నాయి. డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలు వరుసగా హిట్ అవడంతో ప్రస్తుతం విశాల్ మంచి జోరు మీదున్నాడు. గతంలో పందెం కోడి సినిమా తో భారీ హిట్ అందుకున్న విశాల్ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. అయితే విశాల్ కి పందెం కోడి సీక్వెల్ మీద బాగా కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే విశాల్ తన ప్రతి సినిమాని తెలుగు లో విడుదల చేస్తాడు.

ఎన్టీఆర్ సినిమాను ఢికొట్టేందుకు...

ఇక పందెం కోడి సీక్వెల్ ని కూడా తెలుగులో విడుదల కు ఏర్పాట్లను ఎప్పుడో స్టార్ట్ చేసాడు. అయితే విశాల్ కి ప్రస్తుతం ఉన్న కాన్ఫిడెంట్ తో ఒక స్టార్ హీరోను తన సినిమాతో ఈ దసరాకే ఢీ కొట్టబోతున్నాడనే టాక్ వినబడుతుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు... యంగ్ టైగర్ ఎన్టీఆర్. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ లు కలిసి అరవింద సామెత - వీర రాఘవ సినిమా ని ఈ దసరా టార్గెట్ తోనే పని చేస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ ని కంప్లీట్ చేసిన ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ లు అరవింద సామెత షూటింగ్ ని పరిగెత్తిస్తున్నారు. మరి భారీ అంచనాలతో భారీ ఓపెనింగ్స్ ఇచ్చే ఎన్టీఆర్ సినిమా మీద పోటీగా విశాల్ తన సినిమా విడుదల చెయ్యడం అంటే సాహసమే.

అతి విశ్వాసం కొంప ముంచదుగా...?

అయితే విశాల్ గతంలో పందెం కోడిని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో ఇప్పుడు పందెం కోడి సీక్వెల్ ని కూడా అంతే ఆదరిస్తారని.. ఎలాగూ వరుస విజయాలు ఉండనే ఉన్నాయి.. అందుకే ధైర్యంగా ఎన్టీఆర్ తో పోటీకి సై అంటున్నాడు విశాల్. మరి ఇది కేవలం విశాల్ కి ఉన్న ఓవర్ కాన్ఫిడెంట్ అనే మాట వినబడుతుంది. స్టార్ హీరో ఎన్టీఆర్ సినిమా కి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. మరి అంత పెద్ద స్టార్ హీరోతో విశాల్ పోటీకి దిగడం ఎంతవరకు కరెక్ట్ అనే వారు లేకపోలేదు.

Similar News