మహేష్ తో పోటీకి సై అంటున్నాడు..!

తమిళ హీరో విశాల్ తన గర్ల్ ఫ్రెండ్ అనిషా రెడ్డితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. రెండేళ్లుగా ప్రేమికులుగా ఉన్న విశాల్, అనీషా పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. నిన్నగాక మొన్న [more]

Update: 2019-03-18 06:46 GMT

తమిళ హీరో విశాల్ తన గర్ల్ ఫ్రెండ్ అనిషా రెడ్డితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. రెండేళ్లుగా ప్రేమికులుగా ఉన్న విశాల్, అనీషా పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. నిన్నగాక మొన్న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట పెళ్లి ఎప్పుడనేది చెప్పకపోయినా.. ఈ వేసవిలో ఉండబోతుందని సమాచారం ఉంది. ఇక విశాల్ ప్రస్తుతం తమిళ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. డిటెక్టీవ్, అభిమన్యుడు ఇలా వరుస విజయాలతో ఉన్న విశాల్… మురగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకత్వంలో తెలుగు టెంపర్ ని తమిళ్ లో అయోగ్యగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ తో విశాల్ హిట్ ఖాయమంటున్నాడు.

మహర్షితో పోటీ పడతాడా..?

అయితే రేపు ఏప్రిల్ 19కే విడుదల అని ప్రకటించిన అయోగ్య మేకర్స్ ఇప్పుడు ఈ విడుదల డేట్ పై వెనక్కి తగ్గుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. షూటింగ్ ఇంకా ఒక కొలిక్కి రాని కారణంగా సినిమాని వాయిదా వెయ్యాలని చూస్తున్నారట మేకర్స్. షూటింగ్ ఏప్రిల్ 10కి కంప్లీట్ అయినా ప్రమోషన్స్ కి టైం సరిపోదు కనుక సినిమాని మే 10 న విడుదల చెయ్యాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక తమిళనాట అయోగ్యకి పోటీ లేకపోయినా తెలుగులో మాత్రం మహేష్ మహర్షితో విశాల్ కి గట్టి పోటీ ఇస్తాడు. విశాల్ సినిమాలు తమిళంతో పాటుగా తెలుగులోనూ విడుదల చేస్తారు. విశాల్ కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. కానీ మహేష్ తో పోటీకి దిగితే విశాల్ సినిమా హిట్ అయినా కలెక్షన్స్ తగ్గుతాయి. మహర్షి సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ మే 9కి ఫైనల్ డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాలున్న మహర్షితో పోటీకి విశాల్ సై అంటాడా లేదంటే మరో డేట్ చూసుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News