విశాల్ కేరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్...

Update: 2018-06-08 12:09 GMT

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్లపై ఎమ్‌. పురుషోత్తమ్‌ సమర్పణలో యువ నిర్మాత జి. హరి నిర్మించిన 'అభిమన్యుడు' గతవారం విడుదలై సూపర్‌ టాక్‌తో సూపర్‌ కలెక్షన్స్‌ తో దూసుకెళ్తోంది. ఈ ఘన విజయంపై నిర్మాత గుజ్జలపూడి హరి మాట్లాడుతూ - ''కేవలం 7 రోజుల్లోనే 12 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది మా 'అభిమన్యుడు'. రెండోవారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 261 థియేటర్స్‌ లో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌ తో రన్‌ అవుతోంది. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌ మోసాలు ఎలా జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్లు దర్శకులు పి.ఎస్‌. మిత్రన్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.'' అన్నారు.

'అభిమన్యుడు' 7 రోజుల గ్రాస్‌ కలెక్షన్‌!!

నైజాం 4,37,52,661

సీడెడ్‌ 99,85,861

వైజాగ్‌ 1,50,02,989

నెల్లూరు 50,63,222

ఈస్ట్‌ 72,35,797

వెస్ట్‌ 46,41,397

కృష్ణా 1,03,97,414

గుంటూరు 77,09,345

కర్ణాటక 49,00,000

నార్త్‌ ఇండియా 24,00,000

ఓవర్సీస్‌ 91,00,000

7 రోజుల టోటల్‌ 12,01,88,686

Similar News