వినాయక్ కి సెకండ్ హాఫ్ తిప్పలు?

చిరంజీవి తో సినిమా చెయ్యాలని ప్లాప్ డైరెక్టర్స్ అందరూ కాచుకుని కూర్చున్నారు. అందులో దర్శకుడు బాబీ, వినాయక్, మెహెర్ రమేష్ సినిమాలను చిరు ఓకె చేసాడనే టాక్ [more]

Update: 2020-10-29 01:43 GMT

చిరంజీవి తో సినిమా చెయ్యాలని ప్లాప్ డైరెక్టర్స్ అందరూ కాచుకుని కూర్చున్నారు. అందులో దర్శకుడు బాబీ, వినాయక్, మెహెర్ రమేష్ సినిమాలను చిరు ఓకె చేసాడనే టాక్ నడుస్తుంది. అందులో వేదాళం రీమేక్ మెహెర రమేష్ తో చిరు పక్కా చేస్తాడు. ఎందుకంటే వేదాళం రీమేక్ కోసం చిరు అప్పుడే ఫోటో షూట్ కూడా చేయించుకున్నాడు కాబట్టి. అయితే ఆచార్య తర్వాత బాబీ తోనా? వేదాళం రీమేకా? అనేది క్లారిటీ లేదు. మధ్యలో లూసిఫెర్ రీమేక్ ఉంది. లూసిఫెర్ రీమేక్ ని సాహో దర్శకుడు సుజిత్ తో చెయ్యాల్సి ఉండగా.. సుజిత్  ని తప్పించి ఆ ప్రాజెక్ట్ లోకి వినాయక్ ని తీసుకొచ్చారు. అయితే సాహో దర్శకుడు సుజిత్ లూసిఫెర్ రీమేక్ సెకండ్ హాఫ్ ని సరిగా హ్యాండిల్ చెయ్యని కారణంగంనే తప్పించారని టాక్ ఉంది.

అయితే ఇప్పుడు వినాయక్ లూసిఫెర్ రీమేక్ సెకండ్ హాఫ్ వర్క్ విషయంలో తర్జన భర్జలు పడుతున్నాడట. అంటే లూసిఫెర్ లో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా తెలుగు నేటివిటీకికి తగ్గట్టుగా, చిరు హీరోయిజం హైలెట్ చేసే విధంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నారట. లూసిఫెర్ సెకండ్ హాఫ్ ని పూర్తిగా మార్చేసి వినాయక్ దానిని కొత్తగా రాసుకుంటున్నాడట. అయితే నవంబర్ కల్లా వినాయక్ లూసిఫెర్ సెకండ్ హాఫ్ మార్చేసి కొత్తగా చిరుకి వినిపించి ఓకే చేయించుకోవాలని కసితో ఉన్నాడట. ఇక చిరు తో పాటుగా ఈ సినిమాలో నటించే మరో హీరోని వినాయక్ సెట్ చేసుకుని.. సెకండ్ హాఫ్ లో ఆ హీరోకి చిరు తో పాటుగా కాస్త హైలెట్ చేసే విధంగా స్క్రిప్ట్ లో మార్పులు ఉండబోతున్నాయని.. సెకండ్ హాఫ్ లో స్క్రిప్ట్ ని బట్టి సెకండ్ హీరో సెలెక్షన్ ఉండబోతుందట.

Tags:    

Similar News