హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న వినాయ‌క్

ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ వినాయక్ గత కొంతకాలంగా సినిమాల పరంగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అందుకే ఈసారి స్టార్ హీరోని [more]

Update: 2019-05-06 10:23 GMT

ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ వినాయక్ గత కొంతకాలంగా సినిమాల పరంగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అందుకే ఈసారి స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలని నట సింహం నందమూరి బాలకృష్ణ కోసం ఓ కథ రాసుకుని ఓకే చేయించుకున్నాడు. ప్రొడ్యూసర్ కూడా కంఫర్మ్ అయిపోయాడు. అలా హీరో, ప్రొడ్యూసర్ కూడా ఒకే అయినా తరువాత కథ కుదరక ఆ ప్రాజెక్ట్ నుండి వినాయక్ తప్పుకోవాల్సి వచ్చింది. అటు బాలయ్య కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోయాడు. కానీ వినాయక్ మాత్రం ఈసారి ఓ మల్టీస్టారర్ ని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు. అది కూడా తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్ర‌మ్ వేద‌’ను. మాధ‌వ‌న్‌, విజ‌య్‌ సేతుప‌తి హీరోలుగా, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌ కుమార్ హీరోయిన్స్ గా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా రాబోతుంది.

విజ‌య్ పాత్ర‌లో వెంక‌టేష్‌

వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్, నారా రోహిత్‌ హీరోలుగా నటించనున్నారు. అయితే మాధ‌వ‌న్ పాత్ర‌లో నారా రోహిత్‌, విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో విక్ట‌రీ వెంక‌టేష్ నటిస్తున్నారట. ప్రస్తుతం నారా రోహిత్ కి సినిమాలు ఏమీ లేవు. వెంకీ ప్రస్తుతం వెంకీమామ అనే ఇంకో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని డి.సురేష్ బాబు నిర్మించ‌బోత‌న్నార‌ని సమాచారం. వెంకీతో వినాయక్ కు ఇది రెండో సినిమా. గతంలో వీరి కాంబినేషన్ లో ‘లక్ష్మి’ వచ్చింది. రోహిత్ ని వినాయక్ డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి.

Tags:    

Similar News