బాలకృష్ణ - వినాయక్ సినిమాకి అదిరిపోయే టైటిల్

Update: 2018-06-14 07:36 GMT

నందమూరి బాలకృష్ణ 'పైసా వసూల్' తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ లో నటించనున్నాడు. చాలా రోజులు సస్పెన్స్ తర్వాత ఈ సినిమా స్టార్ట్ కాబోతుంది. క్రిష్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ స్పీడ్ అందుకుంది. కాకపోతే డైరెక్టర్ క్రిష్ 'మణికర్ణిక' మూవీ బిజీగా ఉండటంతో ఈ సినిమా లేట్ అయ్యే అవకాశం ఉంది.

మళ్లీ ఫ్యాక్షన్ బాటలో...

అందుకే బాలయ్య ఈ గ్యాప్ లో వినాయక్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అందుకోసం వివి వినాయక్ ప్రీ ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ వర్క్ ను త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఇది ఫ్యాక్షన్ నేపథ్యంలోనే సాగే కథ అని తెలుస్తుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'చెన్నకేశవరెడ్డి' ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు.

టైటిల్ ఇదేనా..?

కానీ ఆ సినిమా బాలయ్య కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అయింది. వినాయక్ టేకింగ్, బాలయ్య యాక్టింగ్ సినిమాకి హైలైట్ అయింది. మళ్లీ చాలా కాలం తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుంది. దాంతో ఇప్పటి నుండే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి నిర్మాత సి కళ్యాణ్ ప్రొడ్యూసర్. జులైలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తేనున్నారట. అంతేకాకుండా ఈ సినిమాకి ఏకే 47 అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు.

Similar News