అదిరిపోయే ఫోజులో చెర్రీ – కైరా..!

సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలతో పాటు 2019లో విడుదలవుతున్న సినిమాల సందడి కూడా ఈ న్యూ ఇయర్ రోజున మాములుగా లేదు. తమ సినిమాల లుక్స్ తో ప్రేక్షకులను [more]

Update: 2019-01-01 08:22 GMT

సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలతో పాటు 2019లో విడుదలవుతున్న సినిమాల సందడి కూడా ఈ న్యూ ఇయర్ రోజున మాములుగా లేదు. తమ సినిమాల లుక్స్ తో ప్రేక్షకులను మైమరపిస్తున్నారు. చిన్నా పెద్ద సినిమాలు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ 2019 కి స్వాగతం చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇక ఈ సంక్రాతి బరిలో ఉన్న వినయ విధేయ రామ నిన్న ఫ్యామిలీ పిక్ తో మెగా ఫాన్స్ తో పాటుగా ఫ్యామిలీ ప్రేక్షకులను అందరిని మైమరపించారు. ఇంకా ఆ ఆనందంలోనే ఉన్న మెగా ఫాన్స్ కి మళ్ళీ ఇవాళ వినయ విధేయ రామ టీం మరో సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ సర్ప్రైజ్ చూసిన మెగా ఫాన్స్ న్యూ ఇయర్ ని మరింత సంతోషంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా

ఇప్పటివరకు వినయ విధేయ రామ సినిమా మాస్ మాస్ అంటూ అంటూ అందరూ కామెంట్ చేస్తుంటే… మెగా ఫాన్స్ కి టెన్షన్ పట్టుకుంది. అయితే తాజాగా న్యూ ఇయర్ కి సందడి చేసున్న ఈ పోస్టర్స్ చూస్తూంటే మాత్రం వినయ విధేయ రామలో ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎపిసోడ్స్ మాములుగా ఉండదనిపిస్తుంది. ఇక న్యూ ఇయర్ కానుకగా రామ్ చరణ్, కైరా ఇచ్చిన ఫోజు అదుర్స్ అన్నట్టుగా ఉంది. రామ్ చరణ్ ట్రెడిషనల్ డ్రెస్సులో తన చేతుల మీదుగా లంగా ఓణిలో మెరిసిపోతున్న కైరా అద్వానీని అలా వయ్యారంగా ఎత్తుకున్న ఆ పోస్టర్ మాత్రం ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

Tags:    

Similar News