అనుకోని అతిథి..అనుకోని సినిమా..!

నిన్న రామ్ చరణ్ `వినయ విధేయ రామా` ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కు అనుకోని [more]

Update: 2018-12-28 06:31 GMT

నిన్న రామ్ చరణ్ 'వినయ విధేయ రామా' ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కు అనుకోని ఓ అతిధి వచ్చారు. చరణ్ కోసం చిరంజీవి, కెటిఆర్ వచ్చారు. ఇది కామనే. కానీ త్రివిక్రమ్ ఎందుకు వచ్చినట్టు? అదే నిన్న పెద్ద ప్రశ్నగా మారింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలు, తన సినిమాలకు తప్ప త్రివిక్రమ్ వేరే సినిమా ఈవెంట్స్ కి అసలు రాడు. కానీ నిన్న వచ్చాడు. దీంతో అంతా షాక్ కి గురైయ్యారు. అయితే నిన్న సస్పెన్స్ ని మెగా స్టార్ చిరంజీవి రివీల్ చేసారు. నిన్న ఆయన మాట్లాడుతూ…”నేను త్రివిక్రమ్ తో డీవీవీ దానయ్య బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నా, అయితే ఈ కాంబినేషన్ ని రామ్ చరణే సెట్ చేసాడు. చరణ్.. థాంక్స్ ఈ కాంబినేషన్ ని సెట్ చేసినందుకు” అని చిరంజీవి అన్నారు.

త్రివిక్రమ్ ఖాళీనే… మరి చిరు…

అసలు ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని ఎవరూ ఊహించలేదు. ఎక్కడా న్యూస్ కూడా రాలేదు. నిజానికి త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో సినిమా చేయాలి కానీ అది ఆగిపోయింది. బన్నీ ఇప్పుడు పరుశురాంతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. కాబట్టి త్రివిక్రమ్ ఖాళీయే. కానీ చిరంజీవి ప్రస్తుతం 'సైరా-నరసింహారెడ్డి' చిత్రం షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇది సోషల్ మెసేజ్ ఉండే కమర్షియల్ సినిమా. ఈ రెండు చిత్రాలు తరువాత త్రివిక్రమ్ తో చిరు సినిమా ఉంటుందని అర్థమవుతోంది. అంటే 2020 వరకు చిరు ఖాళీగా లేడు కాబట్టి అప్పటి వరకు త్రివిక్రమ్ వెయిట్ చేస్తాడా? లేదా వేరే హీరోతో ఈ లోపల ఇంకో సినిమా చేస్తాడా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. మెగా ఫ్యాన్స్ ని ఎంతకుమించి గుడ్ న్యూస్ ఏముంటది.

Tags:    

Similar News